Phule: 200 ఏళ్ల నాటి పోరాటంతో నవంబర్ 27న థియేటర్లలోకి ‘ఫూలే’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా కమర్షియల్ సినిమాల హడావుడి ఎక్కువగా ఉండే టాలీవుడ్ బాక్సాఫీస్ వద్దకు, ఈసారి మనసుల్ని కదిలించే ఒక అద్భుతమైన చారిత్రక చిత్రం రాబోతోంది. సామాజిక సంస్కర్తలు మహాత్మా జ్యోతిరావ్ ఫూలే, సావిత్రిబాయి ఫూలేల జీవిత పోరాటాన్ని ఆవిష్కరిస్తూ తెరకెక్కిన ‘ఫూలే’ చిత్రం తెలుగు డబ్బింగ్ వెర్షన్ నవంబర్ 27న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సినిమాను ప్రత్యేకంగా వీక్షించి, ఫూలే దంపతుల పోరాటం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడటంతో ఈ చిత్రంపై ఒక్కసారిగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. నవంబర్ 28న మహాత్మా జ్యోతిరావ్ ఫూలే 136వ వర్ధంతి సందర్భంగా, ఆయన ఆశయాలను, కులవివక్ష, మహిళా విద్య కోసం ఫూలే దంపతులు చేసిన త్యాగాలను నేటి తరానికి చేరువ చేయాలనే సంకల్పంతో ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రముఖ దర్శకుడు అనంత్ మహదేవన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రతీక్ గాంధీ జ్యోతిరావ్ ఫూలేగా, పత్రలేఖ సావిత్రిబాయి ఫూలేగా జీవించారు. సుపదా క్రియేషన్స్ బ్యానర్‌పై డా. పొన్నం రవిచంద్ర నిర్మాతగా వ్యవహరించగా, ఏషియన్ సినిమాస్ ద్వారా సునీల్ నారంగ్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. చేతన్ కత్తి తెలుగు మాటలు అందించారు.
సినిమా విడుదల సందర్భంగా మంగళవారం హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో నిర్వహించిన ప్రెస్మీట్లో చిత్ర నిర్మాత డా. పొన్నం రవిచంద్ర ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. “ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు. నవంబర్ 27న ఎన్ని సినిమాలు వస్తున్నా, ‘ఫూలే’ ఒక విభిన్నమైన జానర్లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దాదాపు 200 ఏళ్ల క్రితం జరిగిన ఈ చరిత్రను నేటి తరం, ముఖ్యంగా మహిళలు కచ్చితంగా తెలుసుకోవాలి. నవంబర్ 26న నిర్వహించే ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు మహాత్మా ఫూలే పాత్రధారి ప్రతీక్ గాంధీ హాజరవుతున్నారు” అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ప్రముఖులు సినిమాపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కేవలం చరిత్ర పుస్తకాలకే పరిమితం కాకుండా, సమానత్వం, విద్య, మానవ హక్కుల కోసం గత తరాలు చేసిన పోరాటాన్ని కళ్లకు కట్టేలా చూపిస్తున్న ‘ఫూలే’ చిత్రాన్ని యువత, విద్యార్థులు, కుటుంబ సమేతంగా థియేటర్లలో వీక్షించాలని చిత్ర బృందం కోరుతోంది.
Also Read
- Sharwanand : “డింపుల్.. లవ్ యూ !.. ఆ ఎనర్జీ ఏంటి?”: ‘భోగి’ స్టేజ్‌పై శర్వానంద్ ఓపెన్ కామెంట్స్.
- Tharun Bhascker: డ్యూటీ ఎక్కుతున్నా.. దిగే ప్రసక్తే లేదు! ఇకపై తన రూట్ మారుస్తున్నట్లు ప్రకటించిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్!
- Vishwak Sen: పాతాళంలోకి వెళ్లిపోతున్న నన్ను కాలర్ పట్టుకుని పైకి లాగింది తరుణ్ భాస్కరే.. విశ్వక్ ఎమోషనల్ స్పీచ్!
- Abhinav Gomatam: నెలకి 30 వేల జాబ్ వదిలేసి ఏడాదికి 30 వేలే సంపాదించా.. అన్నీ అవమానాలే
తాజావార్తలు
-
Phule: 200 ఏళ్ల నాటి పోరాటంతో నవంబర్ 27న థియేటర్లలోకి ‘ఫూలే’!
-
Sharwanand : “డింపుల్.. లవ్ యూ !.. ఆ ఎనర్జీ ఏంటి?”: ‘భోగి’ స్టేజ్‌పై శర్వానంద్ ఓపెన్ కామెంట్స్.
-
Story Board: దేవదీపావళిగా ప్రసిద్ధి చెందిన కార్తీక పౌర్ణమి! కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటి?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో కార్తీక పౌర్ణమి శోభ.. అరుణాచలేశ్వరుని కల్యాణం, జ్వాలాతోరణం!
-
Sheikh Hasina: భారత్ నుంచి స్వదేశానికి హసీనా.. సంకెళ్లతో తీసుకొస్తామన్న బంగ్లాదేశ్ మంత్రి!
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్‌తో Honda CB500 బైక్..!