IRUMUDI : టికెట్ల అమ్మకాల్లో పెద్దిని దాటిన ‘ఇరుముడి’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ఇరుముడి బ్లాక్ బస్టర్ టాక్ తో భారీ వసూళ్లు రాబడుతూ దూసుకెళ్తోంది. గతకొన్నేళ్ళుగా టాలీవుడ్ లో చూడనటువంటి హిట్ ఇప్పడు ఇరుముడి అందుకుంది. ఈ ఏడాది అత్యధిక ఫుట్ ఫాల్స్ రాబట్టిన సినిమాగా రామ్ చరణ్ ‘పెద్ది’ ఉంది. దాన్ని కూడా ఇప్పుడు రవితేజ ‘ఇరుముడి’ బద్దలు కొట్టింది. సినిమాల మొదటి ఆదివారం థియేటర్లకు వచ్చిన ప్రేక్షకుల సంఖ్య పరంగా ‘ఇరుముడి’ రికార్డ్ క్రియేట్ చేసింది.
ఆన్లైన్ ట్రాక్డ్ షోల ప్రకారం మొదటి ఆదివారం ‘పెద్ది’ చిత్రం 9.47 లక్షల టికెట్ల అమ్ముడయి టాప్ వన్ ప్లేస్ లో ఉండగా ‘ఇరుముడి’ దాదాపు 11 లక్షల టికెట్లతో ఆ రికార్డును బీట్ చేసింది. సూపర్ కంటెంట్ కు తోడు మౌత్ టాక్ తోడవడంతో థియేటర్లలో ఇరుముడి చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపించారు. అయితే బాక్సాఫీస్ వసూళ్ల విషయానికి వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది. 9.47 లక్షల టికెట్ల అమ్మకాలపై ‘పెద్ది’ ఏకంగా రూ. 20.50 కోట్లు సాధించగా 11 లక్షల టికెట్లు అమ్ముడైనప్పటికీ ‘ఇరుముడి’ రూ. 16.88 కోట్లకే పరిమితమైంది. ఎక్కువ మంది ఫుట్‌ఫాల్స్ ఉన్నప్పటికీ వసూళ్లలో ‘పెద్ది’ ముందంజలో ఉండటానికి కారణం రెండింటి సగటు టికెట్ ధరల్లో ఉన్న భారీ వ్యత్యాసమే. ‘పెద్ది’ చిత్ర సగటు టికెట్ ధర రూ. 216 కాగా, ‘ఇరుముడి’ సగటు టికెట్ ధర రూ. 153 గా ఉంది. తక్కువ టికెట్ ధరల వల్ల సాధారణ ప్రేక్షకులు, కుటుంబాలు ‘ఇరుముడి’ థియేటర్లకు అధిక సంఖ్యలో రాగా, ఎక్కువ టికెట్ ధరలతో ‘పెద్ది’ తక్కువ అడ్మిషన్లతోనే అత్యధిక గ్రాస్ సాధించి బాక్సాఫీస్ వద్ద పైచేయి సాధించింది.
Also Read
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
- Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న 'రణబాలి' ట్రైలర్!
తాజావార్తలు
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
-
OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
-
OTR: నెలకు ₹2,000 కోట్లు! చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఇదేనా?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!