PeddiTrailer : ‘పెద్ది’ పెద్దగా మెప్పించలేకపోయాడా? రెహమాన్ దెబ్బేసాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – బుచ్చి కాంబోలో తెరకెక్కుతున్న భారీ చిత్రం పెద్ది. ఫ్యాన్స్ తో పాటు ఆడియెన్స్ లోను ఎన్నో అంచనాలున్న పెద్ది ట్రైలర్ వచ్చేసింది. మోస్ట్ అవేటెడ్ మూవీగా వస్తున్న ‘పెద్ది’ ట్రైలర్ ప్రేక్షకులను పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది. సోషల్ మీడియాలో ఈ ట్రైలర్‌పై ప్రస్తుతం మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.
ముఖ్యంగా ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ట్రైలర్ కు అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా పేలవంగా ఉందని ప్రేక్షకులు ఆశించిన రేంజ్ ‘హై’ ఈ ట్రైలర్లో లభించలేదు. దానికి మిక్సింగ్ సరిగా కుదరలేదు. బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీ డైలాగ్స్ ఏమి చెప్తున్నాడో అర్ధం కానీవిధంగా ఉంది మిక్సింగ్. ఇక దర్శకుడు బుచ్చిబాబు ఒకే ట్రైలర్లో ఎక్కువ సీన్స్, ఎలిమెంట్స్ చూపించాలనే తాపత్రయంలో దాన్ని ఓవర్స్టఫ్ చేసేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే బాలీవుడ్ మూవీ దంగల్, సుల్తాన్ ఛాయలు కనిపించడం కూడా కాస్త నెగిటివ్ అవుతోంది. సినిమాను ఎంతో సిన్సియర్ అండ్ రూటెడ్ కథగా ప్రమోట్ చేస్తుండగా ట్రైలర్లో హీరోయిన్ జాన్వీ కపూర్ ఎపిసోడ్స్ ఆ మూడ్‌కు కాస్త భిన్నంగా అనిపించడం, దేవరలో జాన్వీ పాత్రని గుర్తుచేసినట్టు అనిపించిందని విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుత ట్రెండ్‌లో ఒక సినిమా బాక్సాఫీస్ వద్ద సాధించే ఓపెనింగ్స్ కలెక్షన్లను నిర్ణయించడంలో ట్రైలర్లదే కీలక పాత్ర. కానీ ‘పెద్ది’ టీమ్ ఈ ట్రైలర్ కట్‌ను అంత సీరియస్‌గా తీసుకున్నట్లు అనిపించలేదు. మొదటి రెండు సాంగ్స్ తో ఎక్కడికో వెళ్లిన ఈ సినిమా హైప్ ఆ మధ్య వచ్చిన ఇప్పుడు వచ్చిన ట్రైలర్ తో మిశ్రమ స్పందన రాబట్టింది. ఈ నేపథ్యంలో సినిమాపై అంచనాలను మళ్లీ పెంచడానికి ‘రిలీజ్ ట్రైలర్’ ను తీసుకువస్తారేమో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Gautam Adani: అమెరికాలో అదానీ గెలిచాడు.. ఒక్క దెబ్బతో లీగల్ కేసులన్నీ క్లోజ్.. రూ.84 వేల కోట్ల ప్లాన్‌తో సరికొత్త చరిత్ర!
-
Suriya : సూర్య సాలిడ్ హిట్ కొట్టాడు.. ఆ హీరో కంబ్యాక్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు
-
Janhvi Kapoor: కోలీవుడ్‌లో బంపర్ ఛాన్స్ ఆఫర్ కొట్టేసిన.. జాన్వీ
-
Pat Cummins-SRH: ఇట్స్ వెరీ టఫ్.. కానీ ఆ ఇద్దరి వల్లే గెలిచాం!
-
Sheikh Hasina: “నన్ను అంతం చేయడం మీ తరం కాదు! నేను మళ్లీ నా దేశానికి వస్తా.. నన్ను ఎవరూ ఆపలేరు”: షేక్ హసీనా
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!