Peddi: టీజర్ వచ్చేస్తోంది.. వచ్చే వారం నుంచే అసలైన ఆట!

  • ఏప్రిల్ 30న పెద్ది రిలీజ్
  • చివరి దశకు చేరుకున్న షూటింగ్
  • వచ్చే వారం నుంచి టీజర్ వర్క్ స్టార్ట్
Peddi Movie Teaser, Ram Charan Peddi Update, Buchi Babu Sana, Peddi Release Date, Ram Charan Birthday Special

Peddi Movie Teaser, Ram Charan Peddi Update, Buchi Babu Sana, Peddi Release Date, Ram Charan Birthday Special

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న రగ్గడ్ యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ మూవీ ఏప్రిల్ 30న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. కానీ, ఇంకా ఈ సినిమా షూటింగ్ మాత్రం పూర్తి కాలేదు. అయితే, తాజా సమాచారం ప్రకారం ఆల్మోస్ట్ పెద్ది షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాకు సంబంధించి రామ్ చరణ్ పాల్గొనాల్సిన టాకీ పార్ట్ కంప్లీట్ అయినట్టుగా తెలుస్తోంది. చరణ్ తన పాత్రకు సంబంధించిన డైలాగ్స్ మరియు కీలక సన్నివేశాల చిత్రీకరణను దాదాపుగా ముగించినట్టుగా సమాచారం. మరోవైపు ఆయన లేని కొన్ని చిన్నపాటి ప్యాచ్ వర్క్ సీన్లను సెకండ్ యూనిట్ చిత్రీకరిస్తోంది. ఇక బ్యాలెన్స్ ఉన్న ఒక యాక్షన్ సీక్వెన్స్‌ను లాస్ట్‌ షెడ్యూల్‌లో చిత్రీకరించబోతున్నారు. దీనితో పాటు, ఓ స్పెషల్ సాంగ్ షూట్ కూడా చేయనున్నారు. ఇక్కడితో సినిమా షూటింగ్ దాదాపుగా అయిపోయినట్టేనని చిత్ర యూనిట్ వర్గాల సమాచారం.

Also Read: Ustaad Bhagat Singh: గెట్ రెడీ.. ఈరోజు ట్రైలర్, రేపు రచ్చ రచ్చే!

ఎట్టిపరిస్థితుల్లోను అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ చేయాలనే పట్టుదలతో ఉన్నాడు దర్శకుడు బుచ్చిబాబు. అందుకే ఓ వైపు షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పరుగులు పెట్టిస్తున్నాడు. అలాగే, ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టడానికి రెడీ అవుతోంది చిత్ర యూనిట్. ఈ నేపథ్యంలో పెద్ది టీజర్ రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నారు. టీజర్‌కు సంబంధించిన పనులు వచ్చే వారం నుండి మొదలు పెట్టనున్నట్టుగా సమాచారం. సినిమాపై అంచనాలను పెంచేలా పవర్‌ఫుల్ టీజర్‌ కట్ చేయడానికి సిద్ధమవుతున్నాడు దర్శకుడు బుచ్చిబాబు. మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే ఉంది. ఆరోజే పెద్ది టీజర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన పెద్ది పాటలు సంచలనం సృష్టించాయి. ఇప్పుడు రాబోతున్న టీజర్ అంతకుమించిన అంచనాలు పెంచేలా ఉంటుందనే టాక్ అయితే వినిపిస్తోంది. ఏదేమైనా.. సమ్మర్ కానుకగా రాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.