Peddi : రెంట్ vs పర్సెంటేజ్ వివాదం.. తెలంగాణలో రెంటల్ బేస్ మీదే పెద్ది రిలీజ్..

Peddi

Peddi

టాలీవుడ్‌లో మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ జూన్ 4న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. అయితే ఎగ్జిబిటర్స్ కు నిర్మాతలకు మధ్య రగులుతున్న వివాదం కారణంగా  నైజాంలో రిలీజ్ కు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉందని కొద్దీ రోజులుగా టాక్ వినిపిస్తోంది. ఈ  చిత్ర ప్రదర్శనకు సంబంధించి నైజాం ఏరియా బిజినెస్ వర్గాల నుండి ఒక కీలక సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో థియేటర్ల యజమానులకు, నిర్మాతలకు మధ్య పర్సంటేజ్ సిస్టమ్ గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నప్పటికీ ‘పెద్ది’ సినిమా మాత్రం తెలంగాణలో ఎప్పటిలాగే రెంటల్ బేసిస్ మీదే ఈ చిత్రాన్ని థియేటర్లలో ప్రదర్శించబోతున్నారు.

నిజానికి తెలుగు చిత్ర పరిశ్రమలో కొంతకాలంగా ఈ పర్సంటేజ్ సిస్టమ్ అమలుపై తీవ్రమైన కసరత్తులు జరుగుతున్నాయి. దీనివల్ల ఇరు వర్గాలకు లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నప్పటికీ కొన్ని సాంకేతిక మరియు అంతర్గత కారణాల వల్ల ఇష్యూ ఇంకా నలుగుతోంది. ఈ వివాదాన్ని దీనికి సంబంధించిన నిబంధనలను ఒక కొలిక్కి తీసుకురావడానికి ప్రస్తుతం ట్రేడ్ వర్గాలు ఒక ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేశాయి. ఈ కమిటీ ఆధ్వర్యంలో చర్చలు వేగంగా సాగుతున్నాయి. ఇన్సైడ్ టాక్ ప్రకారం ఇండస్ట్రీలో పూర్తిగా ఈ పర్సంటేజ్ సిస్టమ్‌ను రాబోయే జులై నెల నుండి అమలు చేయాలని భావిస్తున్నారట. ఈ లోపు థియేటర్ల ఎగ్జిబిటర్స్, నిర్మాతలు మరియు పంపిణీదారులు రెంట్, పర్సంటేజీల రేషియోపై అన్ని విషయాలు క్షుణ్ణంగా మాట్లాడుకుని ఒక తుది నిర్ణయానికి రానున్నారు. అందువల్ల ఈ లోపు వచ్చే పెద్ద సినిమాలన్నీ యథావిధిగా పాత రెంటల్ విధానంలోనే రిలీజ్ కాబోతున్నాయి.