Peddi: రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది అనే సినిమా తెరకెక్కుతోంది. గేమ్ చేంజర్ లాంటి డిజాస్టర్ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న సినిమా కావడంతో, ఆయన అభిమానులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో కచ్చితంగా హిట్ కొడతామని అభిమానులు చాలా నమ్మకంతో ఉన్నారు. ఆ నమ్మకానికి తగ్గట్టుగానే, ఫస్ట్ షాట్ అంటూ బుచ్చిబాబు రిలీజ్ చేసిన ఒక గ్లిమ్స్ ఒక్కసారిగా సినిమా మీద అందరిలోనూ అంచనాలను అమాంతం పెంచింది. ఇక ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది.
Read Also: US: భారత్ కారణంగానే రష్యా రెచ్చిపోతుంది.. మార్కో రూబియో విమర్శలు
తాజాగా విజయనగరం సెట్‌లో ఒక ఫైట్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీలో రెండు రోజుల పాటు ఈ నైట్ షూట్ చేసినట్లుగా తెలుస్తోంది. నబా కాంత్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్న ఈ ఫైట్ ను ఈ రోజు నుంచి శంకర్పల్లిలో ప్లాన్ చేశారు. ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు ఇప్పటికే అధికారికంగానే ఇంటర్వ్యూలలో వెల్లడించారు. ఇప్పుడు విజయనగరం నేపథ్యంగా ఈ ఫైట్ సీక్వెన్స్ ప్లాన్ చేయడం కూడా ఆసక్తి పెంచుతుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాను వృద్ధి సినిమాస్ బ్యానర్ మీద సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఉప్పెనతో బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు కావడంతో పాటు, చరణ్ లుక్ ఈ సినిమా మీద అంచనాలను పెంచుతూ పోతోంది.
