Gaurnaidu: ‘పెద్ది’ నుంచి ఊహించని ఊరమాస్ టీజర్.. ‘గౌర్నాయుడు’గా శివరాజ్‌కుమార్ విశ్వరూపం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gaurnaidu: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. తాజాగా ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన టీజర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ ఈ చిత్రంలో ఒక కీ రోల్లో కనిపించబోతున్న విషయం తెలిసిందే. తాజాగా చిత్ర బృందం ఆయనకు సంబంధించిన పాత్రను పరిచయం చేస్తూ ఈ టీజర్‌ను రిలీజ్ చేసింది.
గౌర్నాయుడు.. పవర్ ఫుల్ పహల్వాన్!
గ్రామీణ నేపథ్యంలో సాగే అచ్చమైన మట్టి కుస్తీ నేపథ్యంలో ఈ టీజర్‌ను రూపొందించారు మేకర్స్. ఇందులో శివరాజ్‌కుమార్ అదిరిపోయే మేకోవర్‌తో కనిపించారు. శివరాజ్‌కుమార్, రామ్ చరణ్ కాంబినేషన్లో రాబోతున్న యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని ఈ టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఈ మూవీకి ఆస్కార్ విజేత ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందిస్తుండటం విశేషం. టీజర్లో ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో లెవల్లో ఉంది. తాజాగా గౌర్నాయుడికి సంబంధించిన టీజర్‌తో పాటు చిత్ర బృందం మరో కీలక ప్రకటన కూడా చేసింది. మరో నాలుగు రోజుల్లో పూర్తి స్థాయి ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించింది. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రంపై మెగా అభిమానులతో పాటు సగటు సినిమా ప్రేమికులకు భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.
Also Read
- Nani: నా కెరీర్లోనే అత్యంత కష్టమైన సినిమా ఇదే.. జడల బరువుపై నాని సంచలన వ్యాఖ్యలు!
- Nani: మా డైరెక్టర్ ఎవరినీ కొట్టలేదు.. నాని కీలక వ్యాఖ్యలు
- The Paradise: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి నాని ‘ది ప్యారడైజ్’!
- Hanuman Ansh: త్రివిక్రమ్ చేతుల మీదుగా తెలుగులోకి 'హనుమాన్ అంశ్' - సెప్టెంబర్ 18న గ్రాండ్ రిలీజ్!
Gournaidu a.k.a @nimmashivanna garu❤️🔥❤️🔥
Step into the raw world of #PEDDI#PEDDITrailer in 4 days 🔥
Peddi in cinemas worldwide on 4th June.#GetReadyForPeddi 💥💥 pic.twitter.com/bZDwmdoQNq
— PEDDI (@PeddiMovieOffl) May 14, 2026
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?