Peddi: ‘పెద్ది’ సినిమాకి అసలు ట్రైలరే అక్కర్లేదు.. కంటెంట్ ఉన్నోడికి కట్ అవుట్ చాలు: బుచ్చిబాబు సంచలనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ వరుస ప్రమోషన్లతో హోరెత్తిస్తోంది. అయితే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ గురించి సోషల్ మీడియాలో భారీ చర్చ నడుస్తున్న వేళ, డైరెక్టర్ బుచ్చిబాబు చేసిన సంచలన కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి. అసలు పెద్ది సినిమాకు ట్రైలర్ అవసరం లేదంటూ ఆయన చేసిన బోల్డ్ కామెంట్స్ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.
ట్రైలర్లు చూసే సినిమాలకు వెళ్తున్నామా ఏంటి..
సినిమా రిలీజ్ దగ్గరపడుతున్నా ఇప్పటివరకు అధికారిక ట్రైలర్ రాకపోవడంపై ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు బుచ్చిబాబు తనదైన శైలిలో స్పందించారు. “ఇంత బజ్ ఉన్న ‘పెద్ది’ సినిమాకి రిలీజ్ ట్రైలర్ అక్కర్లేదు.. అసలు ఈ సినిమాకి ట్రైలర్ కూడా అక్కర్లేదు. ఒకప్పుడు మనం అన్ని సినిమాలకీ ట్రైలర్లు చూసే థియేటర్లకు వెళ్లే వాళ్లమా ఏంటి? కథపై, కంటెంట్‌పై మాకు అంత నమ్మకం ఉంది” అని బుచ్చిబాబు కుండబద్దలు కొట్టారు. సినిమాపై ఉన్న విపరీతమైన హైప్ దృష్ట్యా కేవలం ప్రమోషనల్ కంటెంట్, సాంగ్స్ చాలని ఆయన అభిప్రాయపడ్డారు.
Also Read
- Varanasi Update: 'వారణాసి'లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
- world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. 'భోగి' టీజర్ రిలీజ్
- Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
- Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
సోషల్ మీడియాకు గుడ్ బై..
సినిమా పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్లపైనే పూర్తి దృష్టి పెట్టడం కోసం బుచ్చిబాబు డిజిటల్ ప్రపంచానికి దూరంగా ఉంటున్నట్లు వెల్లడించారు. “నేను ప్రస్తుతం సోషల్ మీడియాలో లేను. నా ఫోన్ లో ఉన్న అన్ని సోషల్ మీడియా యాప్స్ డిలీట్ చేసేసాను” అని బుచ్చిబాబు షాకింగ్ నిజం చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చే విమర్శలు, ట్రోల్స్ లేదా అనవసరమైన చర్చలకు దూరంగా ఉంటూ, కేవలం థియేటర్లలో ప్రేక్షకులకు బెస్ట్ అవుట్‌పుట్ ఇవ్వడమే లక్ష్యంగా తాను పనిచేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ట్రైలర్ లేకుండానే సినిమాను థియేటర్లలోకి తెస్తున్నారంటే ‘పెద్ది’ అవుట్‌పుట్ ఏ రేంజ్లో వచ్చిందో అర్థం చేసుకోవచ్చని మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. మరి ట్రైలర్ లేకుండానే జూన్ 4న బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న మెగా పవర్ స్టార్ ‘పెద్ది’ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!