Peddi: సినీ పరిశ్రమలో కొన్ని కథలు విన్నప్పుడు అవి కేవలం హిట్టవుతాయని అనిపిస్తుంది, కానీ మరికొన్ని కథలు మాత్రం మనసుని బలంగా తాకి, ఒక తెలియని ఉద్వేగానికి గురిచేస్తాయి. సరిగ్గా అలాంటి అనుభవాన్నే ఎదుర్కొన్నానని చెప్తున్నారు టాలీవుడ్ ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా.
రాబోయే క్రేజీ ప్రాజెక్ట్ పెద్ది గురించి ఆయన ఇంటర్వ్యూలు ఇస్తూ పంచుకున్న విషయాలు ఇప్పుడు ఫిలిం నగర్లో హాట్ టాపిక్ అయ్యాయి.
సాధారణంగా ఒక సినిమా కథ విన్నప్పుడు టెక్నీషియన్లు అందులో ఉండే గ్రాండియర్ లేదా వర్క్ స్కోప్ గురించి ఆలోచిస్తారు. కానీ ‘పెద్ది’ కథ విన్నాక అవినాష్ కొల్లా దాదాపు 20 నుండి 25 నిమిషాల పాటు సాధారణ స్థితికి రాలేకపోయారట. ఇన్ని ఏళ్ల కెరీర్‌లో ఇలాంటి అనుభూతి కలగడం ఇదే మొదటిసారి అని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. “ఈ సినిమాకు వర్క్ చేసే ఛాన్స్ అస్సలు మిస్ అవ్వకూడదు అనే స్ట్రాంగ్ ఫీలింగ్ కలిగింది. ‘పెద్ది’లో అద్భుతమైన పొటెన్షియల్ ఉంది” అంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు. సినిమాకు వెన్నెముక లాంటి ఆర్ట్ డైరెక్టరే ఇంతలా ఎగ్జైట్ అయ్యారంటే, ఆ కథలో ఎంత లోతు ఉందో అర్థం చేసుకోవచ్చు. విజువల్స్ పరంగానే కాకుండా, ఎమోషన్స్ పరంగా కూడా ఈ చిత్రం ప్రేక్షకులను కట్టిపడేస్తుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి పెద్ది సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ బయటకు రాకపోతూ ఉండడంతో ఆ సినిమాకు సంబంధించి అప్‌డేట్స్ కోసం సినీ ప్రియులు గట్టిగానే కన్నేశారు. ఒక ఆర్ట్ డైరెక్టర్ విజన్ నుంచి వస్తున్న ఈ రియాక్షన్ చూస్తుంటే, వెండితెరపై ఏదో మ్యాజిక్ జరగబోతోందని స్పష్టమవుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో అనేది.
