పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘హరిహర వీరమల్లు’ ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతోంది. అనేక వాయిదాల తర్వాత ఈ చిత్రం జూన్ 12, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. 17వ శతాబ్దం నేపథ్యంలో రూపొందుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా, పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓ అద్భుతమైన విజువల్ ట్రీట్‌ను అందించనుంది. తాజాగా, పవన్ కళ్యాణ్ ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ పనులను పూర్తి చేశారు. ఆయన బిజీ షెడ్యూల్‌ను బ్యాలెన్స్ చేస్తూ, ‘ఓజీ’ సినిమా షూటింగ్ పూర్తి చేసిన అనంతరం రాత్రి 10 గంటలకు డబ్బింగ్ ప్రారంభించి, తెల్లవారుజాము 2 గంటల వరకు నిరవధిక శ్రమతో పనిని ముగించారు.
Also Read: Yash Vs Ranbeer: ‘రామాయణం’ కోసం రంగంలోకి హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్
కేవలం నాలుగు గంటల్లో డబ్బింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ డెడికేషన్‌పై అభిమానులు, చిత్ర యూనిట్ సభ్యులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సోషల్ మీడియాలో ‘హరిహర వీరమల్లు’ హ్యాష్‌ట్యాగ్‌తో ఈ విషయం ట్రెండింగ్‌లో నిలిచింది. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రానికి మొదట క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా, ప్రస్తుతం జ్యోతి కృష్ణ ఈ ప్రాజెక్ట్ బాధ్యతలను చేపట్టారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ, తోట తరణి ప్రొడక్షన్ డిజైన్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తున్నాయి.
Also Read: Kalki : మా బాధ్యత పెరిగింది.. రేవంత్ ప్రభుత్వానికి కల్కి టీమ్ థాంక్స్..
నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ మొఘల్ చక్రవర్తి పాత్రలో ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇరాన్, కెనడా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లో హై-ఎండ్ వీఎఫ్ఎక్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ రాజకీయ, సినిమా షెడ్యూళ్లతో బిజీగా ఉన్నప్పటికీ, ‘హరిహర వీరమల్లు’ కోసం తన పూర్తి సమయాన్ని కేటాయించడం ఆయన వృత్తి మీద పట్ల అభిమానులకున్న గౌరవాన్ని మరింత పెంచింది. ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్లో మరో మైలురాయిగా నిలిచే సూచనలు కనిపిస్తున్నాయి.