పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా ఈ గురువారం నాడు రిలీజ్ అయింది. అయితే ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించగా సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. క్రిష్ దర్శకత్వంలో మొదలైన ఈ సినిమాని జ్యోతి కృష్ణ పూర్తి చేశారు. ఏఎం రత్నం సమర్పకుడిగా వ్యవహరించిన ఈ సినిమాని ఆయన బంధువు దయాకర్ రావు నిర్మించాడు. అయితే హరిహర వీరమల్లు సినిమా మొదలుపెట్టినప్పుడే ఫ్యాన్ ఇండియా సినిమాగా మొదలుపెట్టారు.
Also Read : China Piece: ఆసక్తికరంగా ‘చైనా పీస్’ టీజర్
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే చివరి నిమిషంలో హిందీ రిలీజ్ చేయలేదు. ఈ సినిమా హిందీ వర్షన్ రాబోతున్న శుక్రవారం నాడు రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. తాజాగా ఎన్టీవీకి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చిన దర్శకుడు జ్యోతి కృష్ణ ఈ విషయాన్ని వెల్లడించారు. అంతేకాక సినిమా గ్రాఫిక్స్ విషయంలో వస్తున్న కంప్లైంట్స్ గురించి ఆయన స్పందిస్తూ, సినిమా కథ లేదా ఇతర విషయాల మీద కంప్లైంట్స్ ఉంటే ఏమైనా చెప్పొచ్చు, అలాంటి వాటి మీద కంప్లైంట్స్ లేకపోవడంతోనే గ్రాఫిక్స్ బాలేదని మాట్లాడుతున్నారని ఆయన వెల్లడించారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో అనేకమంది నటీనటులు ఇతర కీలక పాత్రలలో నటించారు.
