Site icon NTV Telugu

OG: పవన్‌ కల్యాణ్‌ OG సినిమా టికెట్‌ వేలంకు రికార్డ్‌ ధర

Og

Og

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘దే కాల్ హిమ్ ఓజీ’ (OG) సినిమా బెనిఫిట్ షో టికెట్ ఒకటి రికార్డ్ ధరకు వేలం పాటలో అమ్ముడుపోయింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్‌లో జరిగిన ఈ వేలంపాటలో టికెట్ ఏకంగా రూ.1,29,999కు పలికింది. ఈ టికెట్‌ను పవన్ కల్యాణ్ హార్డ్‌కోర్ అభిమాని అయిన ఆముదాల పరమేష్ దక్కించుకున్నారు. టికెట్ నుంచి వచ్చిన మొత్తాన్ని జనసేన పార్టీ కార్యాలయానికి ఇవ్వనున్నట్లు పరమేష్ తెలిపారు.

Also Read:Idli Kadai: కట్టప్ప పాత్ర కంటే.. ధనుష్ ‘ఇడ్లీ కడై’ లో వర్క్ కష్టం: సత్యరాజ్

సినిమా రిలీజ్‌కు ముందే ఇలాంటి రికార్డులు సృష్టించడం పవన్ సినిమాలకు కొత్తేమీ కాదు. పరమేష్ మాట్లాడుతూ, “పవన్ గారి సినిమా కోసం ఎంతైనా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ డబ్బు పార్టీ కార్యాలయానికి ఇవ్వడం ద్వారా మా ఆరాధనను చాటుకుంటున్నాం” అని అన్నారు. ‘ఓజీ’ సినిమాన్ని సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇది ఒక యాక్షన్ క్రైమ్ డ్రామా, ఇందులో పవన్ కల్యాణ్ ఒక గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నారు.

Also Read:Mohanlal: ఇది నిజమేనా అని అనిపించింది..’ దాదాసాహెబ్ ఫాల్కే గౌరవంపై మోహన్‌లాల్ ఎమోషనల్

హీరోయిన్‌గా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాశ్ రాజ్ వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీత దర్శకుడు తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఈ నెల 25న (సెప్టెంబర్ 25, 2025) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా అభిమానులు వివిధ ప్రాంతాల్లో బెనిఫిట్ షోలు నిర్వహిస్తున్నారు. ‘ఓజీ’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Exit mobile version