Site icon NTV Telugu

Pawan Kalyan: విశ్వంభరునికి పవన్ శుభాకాంక్షలు

Pawan Chiru

Pawan Chiru

విశ్వంభరునికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఒక లేఖ విడుదల చేశారు రేపు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఇప్పటినుంచే ఛాన్స్ సెలబ్రేషన్స్ మొదలుపెట్టారు ఈ నేపథ్యంలో తన సోదరుడికి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు చెబుతూ లేక విడుదల చేశారు. చిరంజీవిగా ప్రేక్షక లోకాన్ని రంజింపచేసి ధ్రువతారగా వెలుగొందుతున్న మా అన్నయ్య చిరంజీవి గారికి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయన తమ్ముడిగా పుట్టడం ఒక అదృష్టమైతే ఆయన కష్టాన్ని చిన్నప్పటి నుంచి చూస్తూ పెరగడం ఒక గొప్ప అనుభవం… వెల కట్టలేని జీవిత పాఠం.

Nara Rohith : నా ఇంటిపేరుతోనే జనాలకు సమస్య.. నారా రోహిత్ కామెంట్స్

ఒక సాదాసీదా సాధారణ కుటుంబం నుంచి వచ్చిన చిరంజీవి గారు ఒక అసాధారణ వ్యక్తిగా విజయాలు సాధించి ఎల్లలు దాటి కీర్తిప్రతిష్టలు సాధించడం నాకే కాదు నాలాంటి ఎందరికో స్ఫూర్తి ప్రదాత. చిరంజీవి గారు కీర్తికి పొంగిపోలేదు.. కువిమర్శలకు కుంగిపోనూ లేదు. విజయాన్ని వినమ్రతతో.. అపజయాన్ని సవాలుగా స్వీకరించే పట్టుదల ఆయన నుంచే నేను నేర్చుకున్నాను. అన్నిటిని భరించే శక్తి ఆయన నైజం. అందుకే ఆయన ‘విశ్వంభరుడు’..! పితృ సమానుడైన అన్నయ్యకు, మాతృ సమానురాలైన వదినకు ఆ భగవంతుడు సంపూర్ణ ఆయుష్షుతో కూడిన ఆరోగ్య సంపదను ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు.

Exit mobile version