NTV Telugu Site icon

OG : గ్యాంగ్ స్టర్ పవన్.. టెన్షన్ లో ఫాన్స్!

Pawan Kalyan Og

Pawan Kalyan Og

పవన్ కళ్యాణ్ ఒకపక్క సినిమాలు మరో పక్క రాజకీయాలతో బిజీ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన రాజకీయాల్లో పూర్తిస్థాయిలో బిజీ కాక ముందు పలు సినిమాలు లైన్లో పెట్టారు అలా లైన్ లో పెట్టిన అన్ని సినిమాలలో పవన్ కళ్యాణ్ అభిమానులు విపరీతంగా ఎదురుచూస్తున్న సినిమా ఏదైనా ఉందంటే అది సుజిత్ దర్శకత్వంలో అనౌన్స్ చేసిన ఓజీ. ఈ సినిమా ఫస్ట్ డే వచ్చిన పోస్టర్ నుంచి సినిమా మీద ప్రేక్షకులలో ముఖ్యంగా మెగా అభిమానులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లుక్ అదిరిపోయింది. ఈమధ్య కాలంలో పవన్ కళ్యాణ్ సినిమాలలో ఒక మంచి లుక్ అంటే ఈ సినిమా లుక్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తిగావచ్చింది. ఈ సినిమా మీద ఉన్న అంచనాల కూడా ఒక రేంజ్ లో ఉన్నాయి. కాకపోతే ఈ సినిమా షూట్ డిలే అవుతూ ఉండడం పవన్ అభిమానులను టెన్షన్ పెడుతోంది.

SSMB29: అవుట్ డోర్ షూట్ కోసం బయలుదేరిన మహేష్!

ఈ సినిమాకి ఇంకా 12 రోజుల పాటు పవన్ కళ్యాణ్ డేట్స్ కేటాయిస్తే పూర్తవుతుంది. కానీ ఆ 12 రోజులకు ఎప్పుడు డేట్స్ కేటాయిస్తారు? అనే విషయం మీద క్లారిటీ లేదు. దీంతో ప్రస్తుతానికి టీం అంతా ఆయన కోసమే ఎదురుచూస్తోంది. నిజానికి సుజిత్ సహా ఆయన టీం పవన్ ను ఎన్నోసార్లు అప్రోచ్ అయింది. కానీ ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన నాన్ థియేట్రికల్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడయ్యాయి. సినిమా షూటింగ్ కూడా పూర్తయితే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాలని అనుకుంటున్నారు. అయితే ఈ సినిమాకి ఇప్పుడు ఉన్న క్రేజ్ వేరే లెవెల్ లో ఉంది కానీ సినిమాని ఇలాగే లేట్ చేస్తే ఆ క్రేజ్ తగ్గిపోతుందేమో అనే ఫీలింగ్లో మెగా ఫాన్స్ ఉన్నారు. నిజానికి ఈ సినిమాని సమ్మర్ కి దింపితే కరెక్ట్ గా ఉండేదని ఇప్పుడు అది ఇంకా లేట్ అవుతూ ఉండటం ఇబ్బందికరమేనని భావిస్తున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని డివివి దానయ్య నిర్మిస్తున్నాడు.