OG 2 Update: పవన్ కళ్యాణ్ ‘ఓజీ 2’ స్క్రిప్ట్ లాక్.. కానీ బిగ్ ట్విస్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan OG 2 Update: ‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం రెండు ప్రాజెక్టులు ఉన్న సంగతి తెలిసిందే. వీటిలో దర్శకుడు సుజీత్ తెరకెక్కించనున్న ‘ఓజీ’ సీక్వెల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. తొలి భాగం ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో.. సీక్వెల్‌ను మరింత యాక్షన్‌తో నింపేలా రూపొందించేందుకు చిత్ర బృందం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్‌ను మేకర్స్ లాక్ చేసినట్లు తెలుస్తోంది. మొదటి భాగం విజయాన్ని దృష్టిలో పెట్టుకుని సీక్వెల్ కథను మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దినట్లు సమాచారం. యాక్షన్ ఎపిసోడ్స్‌తో పాటు కథలో మరిన్ని ఆసక్తికరమైన అంశాలను జోడించారట. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై పవన్ కళ్యాణ్ కూడా ఆసక్తిగా ఉన్నట్లు టాక్.
అయితే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత, రాజకీయ కార్యక్రమాల కారణంగా ఓజీ 2 షూటింగ్ షెడ్యూల్లో మార్పులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది సమ్మర్ తర్వాతే ఈ సీక్వెల్ చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం. దీంతో అప్పటివరకు దర్శకుడు సుజీత్ తన మరో ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. సుజీత్ ప్రస్తుతం నానితో ‘బ్లడీ రోమియో’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఓజీ షూటింగ్ ప్రారంభమయ్యేలోపు ఈ సినిమాను పూర్తి చేయాలని ప్లాన్ చేశాడట. పవన్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్‌లో ఓజీ 2 నుంచి అభిమానులకు ప్రత్యేక అప్డేట్ ఇవ్వాలని మేకర్స్ భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
Also Read
- Deepika Padukone: 'రాకా'.. హీరోయిన్ దీపికా పదుకొనే పనైపోయినట్టే, ఇక అవుట్!
- Varanasi Update: ‘వారణాసి’పై క్రేజీ అప్డేట్.. ఈసారి పకడ్బందీగా ప్లాన్ చేసిన రాజమౌళి!
- Lokesh Kanagaraj DC Movie Review : లోకేష్ కనగరాజ్ 'డీసీ' రివ్యూ..
- AAA Cinemas Vizag: ఈసారి పుష్పరాజ్‌ని కలవడం కష్టమే.. వైజాగ్ AAA ఓపెనింగ్‌కు ఫ్యాన్స్‌కు నో ఎంట్రీ!
మరోవైపు పవన్ కళ్యాణ్, దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్లో ప్రకటించిన మరో ప్రాజెక్ట్ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా ప్రస్తుతానికి హోల్డ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన స్క్రిప్ట్ పూర్తిగా లాక్ కాలేదని సమాచారం. పవన్ సూచించిన మార్పులు, చేర్పులకు అనుగుణంగా సురేందర్ రెడ్డి స్క్రిప్ట్‌పై మరోసారి వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కథను మరింత మెరుగ్గా తీర్చిదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. దీంతో ఈ ప్రాజెక్ట్ భవిష్యత్తుపై కొంత సందిగ్ధత నెలకొంది. ఏదేమైనా ఓజీ విషయంలో మాత్రం అభిమానులు మరికొంత కాలం వేచి చూడాల్సిందే.
తాజావార్తలు
-
OG 2 Update: పవన్ కళ్యాణ్ ‘ఓజీ 2’ స్క్రిప్ట్ లాక్.. కానీ బిగ్ ట్విస్ట్!
-
Vu Glo Mini-LED TV: వీయూ గ్లో మినీ ఎల్ఈడీ టీవీ విడుదల.. 120Hz డిస్ప్లే, 50W సౌండ్‌తో కొత్త స్మార్ట్ టీవీ
-
Trent Boult విధ్వంసం.. యార్కర్‌తో బెయిర్‌స్టోకు షాక్.! ‘బై-బై’ సెలబ్రేషన్ వీడియో వైరల్.!
-
Telangana High Court: “సమాజంలో ఎవరికైనా బాధ్యత ఉందా”.. ఉచిత పథకాలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
CM Chandrababu: వారికి ఎంతైనా ఖర్చు పెట్టాలనుంది.. కానీ ఖజానా ఖాళీగా ఉంది!
ట్రెండింగ్
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!