Site icon NTV Telugu

Pawan Kalyan : పవన్ కోసం వక్కంతం వంశీ కథలు?

Pawan Kalyan

Pawan Kalyan

పవన్ కళ్యాణ్ హీరోగా, రామ్ తాళ్లూరి నిర్మాణంలో ఒక సినిమా రూపొందాల్సిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ రామ్ తాళ్లూరికి చాలాకాలం క్రితమే డేట్స్ ఇచ్చారు కానీ సరైన దర్శకుడు, సరైన కథ దొరకకపోవడంతో సినిమా మొదలు కాలేదు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌ను సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయాలనే ఆసక్తి కనబరుస్తున్నారని సమాచారం. తాజాగా పవన్ కళ్యాణ్‌కి కొత్త కథ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఆయన రాజకీయంగా బిజీగా ఉండడంతో సినిమాకి ఇంకా గ్రీన్ సిగ్నల్ లేదా రెడ్ సిగ్నల్ ఇవ్వ లేదు.

Also Read :Allu Arjun: షాకింగ్.. రీ రిలీజ్ వద్దన్న బన్నీ?

ఈ సినిమా కోసం వక్కంత వంశీ రెండు స్క్రిప్ట్‌లు సిద్ధం చేశారు. ఆ రెండు కథలు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఆయన ఆసక్తి చూపినప్పటికీ, ఎప్పుడు చేయాలనేది చెప్పలేదని తెలుస్తోంది. గతంలో జనసేనకు ఆర్థిక సహాయం చేసిన రామ్ తాళ్లూరికి జనసేనలో ఒక కీలక పదవి కూడా అప్పగించారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈయనతో సినిమా చేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు, ఎందుకంటే ఆయనకు అప్పటికే డేట్స్ కేటాయించారు. అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో స్పష్టత లేదు.

Exit mobile version