Pawan Kalyan : యాక్టింగ్’కు దూరంగా పవన్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవన్ కళ్యాణ్ సరైన హిట్ చూసి 16 ఏళ్ళు అయింది. 2013లో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ తర్వాత 10 సినిమాలు చేస్తే, ‘గోపాల గోపాల’, ‘ఓజీ’ మాత్రమే బాక్స్ ఆఫీస్ వద్ద ఓకే అనిపించుకున్నాయి. ఎన్ని డిజాస్టర్స్ పడినా పవన్ కళ్యాణ్ వాటికి అతీతం అని ఫాన్స్ భావిస్తూ ఉంటారు. ఇక రాజాకీయాల్లో ఎంట్రీ ఇచ్చాక పార్టీని నడిపించడానికి డబ్బులు కావాలి కాబట్టే నటిస్తానని చెప్పే పవన్ కళ్యాణ్, ఇప్పుడు యూటర్న్ తీసుకొని కొంతకాలం యాక్టింగ్ కు దూరంగా ఉండాలని అనుకుంటున్నాడు.
‘ఉస్తాద్’ ఫ్లాప్ తర్వాత ‘పవన్ క్రియేటివ్ వర్క్స్’ పెట్టిన పోస్ట్ చూస్తుంటే, పవన్ యాక్టింగ్ కు ఫుల్ స్టాప్ పడింది అనిపిస్తుంది. వెంటనే కొత్త సినిమాలు కమిట్ అయ్యే ప్లాన్స్ లేవని, ఏవైనా ఉంటే అఫీషియల్ గా తెలియజేస్తామన్నారు. సరైన టైంలో ‘ఓజీ 2’ గురించి అప్డేట్ ఇస్తామన్న పోస్ట్ ఆలోచించేలా చేసింది. కొత్త సినిమాల సంగతి తర్వాత, ఆల్రెడీ కమిట్ అయిన సురేందర్ రెడ్డి మూవీని ప్రస్తావించకపోవటం మెగా ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది. ఈ లెక్కన వెంటనే చేయాల్సిన సురేందర్ రెడ్డి – రామ్ తాళ్లూరి మూవీ ఉండదని తేలిపోయింది. మరోవైపు, సురేందర్ రెడ్డి స్క్రిప్ట్ పవన్ కు నచ్చకపోవడంతో డైరెక్టర్ రీరైట్ చేస్తున్నారనే న్యూస్ కూడా స్ప్రెడ్ అయింది.
Also Read
ఎన్ని డిజాస్టర్స్ పడినా మర్చిపోయి మరో మూవీ చేసే పవన్ కళ్యాణ్ ను, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిజల్ట్ ఆలోచించేలా చేసింది. ఇంత పూర్ ఓపెనింగ్స్ ఈ మధ్యకాలంలో చూడలేదు. ఎలక్షన్ ముందే ఒప్పుకున్న ‘వీరమల్లు’, ‘ఓజీ’, ‘ఉస్తాద్’ సినిమాలను డెప్యూటీ సీఎం అయ్యాక పూర్తి చేసి రిలీజ్ చేశారు. ‘వీరమల్లు’, ‘ఉస్తాద్’ డిజాస్టర్స్ అయితే, ‘ఓజీ’ బ్రేక్ ఈవెన్ అయి కేవలం ఫ్యాన్స్ మూవీగా నిలిచింది. మితిమీరిపోయిన వైలెన్స్, యాక్షన్ సీన్స్ వల్ల ఇవి అన్ని వర్గాల వారిని ఆకట్టుకోలేకపోయాయి. ‘ఓజీ’ సెట్స్ పై ఉండగానే సుజిత్, నానితో ‘బ్లడీ రోమియో’ ప్రకటించాడు. అయితే నాని ప్రస్తుతం ‘పారడైజ్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ‘బ్లడీ రోమియో’ సెట్స్ పైకి రావడానికి ఐదారు నెలలు పట్టనుంది. ఈలోగా ‘ఓజీ 2’ కథ రాసుకునే పనిలో సుజిత్ ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. అయితే, ఆరోగ్య రీత్యా కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కొన్నాళ్ళ పాటు యాక్టింగ్ కు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Trump: ట్రంప్ దౌత్యం విఫలం.. మరోసారి ఇంధన వసతులపై రష్యా-ఉక్రెయిన్ పరస్పర దాడులు
-
TGTET ఇన్సర్వీస్ కీ విడుదల.. అభ్యంతరాలకు ఇదే చివరి ఛాన్స్.!
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల భారీ పెంపు.. అసలు నిజమిదే!
-
Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
-
Tarique Rahman: బ్రిక్స్కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?