Site icon NTV Telugu

Pawan Kalyan: తీసుకునే లోకంలో ఇవ్వాలనుకున్న విహాన్ గొప్పవాడు

Pawan Kalyan Speech

Pawan Kalyan Speech

X లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్నారి విహాన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. పుట్టినరోజున సేవా మార్గాన్ని ఎంచుకున్న విహాన్‌కు పవన్ కళ్యాణ్ నుండి హృదయపూర్వక అభినందనలు అందాయి. తీసుకునే లోకంలో ఇవ్వాలనుకున్న విహాన్ గొప్పవాడు పవన్ కళ్యాణ్ ప్రశంశించారు. విహాన్ ఉదారత చూసి ప్రేరణ పొందినట్టు తెలిపిన పవన్ కళ్యాణ్, అనారోగ్య పరిస్థితిలోనూ సేవా కార్యం చేయడం గర్వకారణం అన్నారు. చిన్న వయసులో పెద్ద హృదయాన్ని చూపించి అందరి మనసులను గెలుచుకున్న విహాన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, ఆరోగ్యం, ఆనందం కలగాలని ఆశీర్వాదించారు. విహాన్‌ను చూసి ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు.

Also Read:Anasuya : దారుణంగా మోసపోయిన అనసూయ.. పోస్టు వైరల్

చిన్నారి విహాన్‌ సిస్టిక్ ఫైబ్రోసిస్ (CF) అనే జన్యుపరమైన రుగ్మతతో బాధ పడుతున్నారు. ఇది శరీరం మందపాటి శ్లేష్మం ఉత్పత్తి చేస్తుంది, ప్రధానంగా శ్వాసకోశ వ్యవస్థ, జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా, సిస్టిక్ ఫైబ్రోసిస్ ఊపిరితిత్తులు, ప్యాంక్రియాస్, కాలేయం, పిత్తాశయం, ప్రేగులను ప్రభావితం చేయవచ్చు. ఇలాంటి ఓ రుగ్మతతో బాధ పడుతూ కూడా విహాన్ తన పుట్టినరోజున కిడ్డీ బ్యాంక్ పగలకొట్టి ఒక భాగం జనసేనకు ఫండ్ గా, మరో భాగం తనలాగా అదే రుగ్మతతో బాధ పడుతున్న చిన్నారికి ఫండ్ గా ఇస్తుంటాడు. సిస్టిక్ ఫైబ్రోసిస్ పై సోషల్ మీడియా వేదికగా అవగాహన కల్పించే కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంటారు చిన్నారి తల్లి శ్వేత.. ఇక, తాజా ఘటనను శ్వేత సోషల్ మీడియాలో షేర్ చేయగా.. దాన్ని చూసి పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో స్పందించారు.

Exit mobile version