Pawan Kalyan : తెలుగు సినిమా ఇండస్ట్రీ కి వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్
- ప్రాయశ్చిత్త దీక్ష మూడవ రోజు దీక్షలో పవన్ కళ్యాణ్
- కనకదుర్గమ్మ ఆలయాన్ని శుద్ధి చేసిన పవన్ కళ్యాణ్
- అమ్మ వారి మెట్లకు పసుపు రాసి బొట్లుపెట్టిన పవన్ కళ్యాణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీవారి లడ్డు అపవిత్రం అయ్యిందని చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష మూడవ రోజులో భాగంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో శుద్ధి కార్యక్రమం చేశారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం వద్ద మెట్లను పవన్ తానే స్వయంగా శుద్ధి చేసి అమ్మవారి ఆలయం మెట్లకు పసుపు రాసి బొట్లు పెట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రకాష్ రాజ్, సినిమా నటులపై కీలక వ్యాఖ్యలు చేసారు పవన్
లడ్డు వివాదంపై ప్రకాశ్ రాజ్ చేసిన ట్వీట్ కు సమాధానంగా పవన్ మాట్లాడుతూ ” అసలు ప్రకాష్ రాజ్ కు సంబంధం ఏంటి, నేను ఏమైన ఇస్లాంని నిందించినా, లేక క్రిస్టినీయానిటీని నిందించానా, ప్రకాష్ రాజ్ అంటే తనకు గౌరవముందని, కానీ లడ్డు విషయంలో అపహాస్యం చేసేలా మాట్లాడితే మాత్రం సహించేది లేదన్నారు. తప్పు జరిగితే మాట్లాడకూడదా. హిందువుల మీద దాడి జరిగితే మాట్లాడం తప్పా, ఏం జరిగింతో తెలుసుకుని ప్రకాష్ రాజ్ మాట్లాడాలి, తాను అన్ని మతాలను గౌరవిస్తానని, ఏ మతాన్ని విమర్శించనని చెప్పారు. సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తప్పు జరిగితే మాట్లాడొద్దా? సెక్యులరిజం అంటే టూ వే అని వన్ వే కాదని చెప్పారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దని” ప్రకాశ్ రాజ్ ను హెచ్చరించారు.
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
అలాగే సినిమా నటుల గురించి మాట్లాడుతూ ” ముఖ్యంగా సినిమా వాళ్లకి చెప్తున్నాను. మీరు మాట్లాడితే పద్దతిగా మాట్లాడండి, లేదంటే మౌనంగా కూర్చోండి, అంతేగాని మీ మీ మాధ్యమాల అపహేళన చేస్తే మాత్రం ప్రజలు మిమ్మల్ని క్షమించరు. ఎందుకంటే ఇది డీప్ పైన్. సినీ ఇండస్ట్రీలో కొందరు లడ్డూ మీద జోక్స్ వేస్తున్నారు. ఓ సినిమా ఈవెంట్లో లడ్డూ అనేది సెన్సిటివ్ ఇష్యూ అని ఓ హీరో అన్నారు. మళ్లీ ఇంకోసారి అలా అనొద్దు.. అపహాస్యం చేస్తే ప్రజలు మిమల్ని క్షమించరు” అని అన్నారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?