NTV Telugu Site icon

Pawan Kalyan : తెలుగు సినిమా ఇండస్ట్రీ కి వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్

Untitled Design (6)

Untitled Design (6)

శ్రీవారి లడ్డు అపవిత్రం అయ్యిందని చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష మూడవ రోజులో భాగంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో శుద్ధి కార్యక్రమం చేశారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం వద్ద మెట్లను పవన్ తానే స్వయంగా శుద్ధి  చేసి అమ్మవారి ఆలయం మెట్లకు పసుపు రాసి బొట్లు పెట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రకాష్ రాజ్, సినిమా నటులపై కీలక వ్యాఖ్యలు చేసారు పవన్

లడ్డు వివాదంపై ప్రకాశ్ రాజ్ చేసిన ట్వీట్ కు సమాధానంగా పవన్ మాట్లాడుతూ ” అసలు ప్రకాష్ రాజ్ కు సంబంధం ఏంటి,  నేను ఏమైన ఇస్లాంని నిందించినా, లేక క్రిస్టినీయానిటీని నిందించానా, ప్రకాష్ రాజ్ అంటే తనకు గౌరవముందని, కానీ లడ్డు విషయంలో అపహాస్యం చేసేలా మాట్లాడితే మాత్రం సహించేది లేదన్నారు. తప్పు జరిగితే మాట్లాడకూడదా. హిందువుల మీద దాడి జరిగితే మాట్లాడం తప్పా,  ఏం జరిగింతో తెలుసుకుని ప్రకాష్ రాజ్ మాట్లాడాలి, తాను అన్ని మతాలను గౌరవిస్తానని, ఏ మతాన్ని విమర్శించనని చెప్పారు. సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తప్పు జరిగితే మాట్లాడొద్దా?  సెక్యులరిజం అంటే టూ వే అని వన్ వే కాదని చెప్పారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దని” ప్రకాశ్ రాజ్ ను హెచ్చరించారు.

అలాగే సినిమా నటుల గురించి మాట్లాడుతూ ”   ముఖ్యంగా సినిమా వాళ్లకి చెప్తున్నాను. మీరు మాట్లాడితే పద్దతిగా మాట్లాడండి, లేదంటే మౌనంగా కూర్చోండి, అంతేగాని మీ మీ మాధ్యమాల అపహేళన చేస్తే మాత్రం ప్రజలు మిమ్మల్ని క్షమించరు. ఎందుకంటే ఇది డీప్ పైన్. సినీ ఇండస్ట్రీలో కొందరు లడ్డూ మీద జోక్స్ వేస్తున్నారు. ఓ సినిమా ఈవెంట్లో లడ్డూ అనేది సెన్సిటివ్ ఇష్యూ అని ఓ హీరో అన్నారు. మళ్లీ ఇంకోసారి అలా అనొద్దు.. అపహాస్యం చేస్తే ప్రజలు మిమల్ని క్షమించరు” అని అన్నారు.