Site icon NTV Telugu

Pawan Kalyan: మైత్రీ మేకర్స్, విశ్వ ప్రసాద్ లేకపోతే వీరమల్లు రిలీజ్ కష్టమయ్యేది!

Pawan Kkkk

Pawan Kkkk

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అయితే ముందు రోజే ప్రీమియర్స్ వేశారు. ప్రీమియర్స్ సమయానికి కూడా ఇంకా KDMs రిలీజ్ కాకపోవడం కలకలం లేపింది. అయితే చివరి విషయంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలతో పాటు టీజీ విశ్వప్రసాద్ కొంత అమౌంట్‌కి అడ్డం ఉండి సినిమా రిలీజ్‌కి సహకరించారు. ఇదే విషయాన్ని తాజాగా పవన్ కళ్యాణ్ తన ప్రెస్ మీట్‌లో వెల్లడించారు.

Also Read:Gandikota Murder Case: గండికోట రహస్యంగా మారిన బాలిక హత్య..! ఏం జరిగినట్టు..?

“అసలు సినిమాని ఎలా ముందుకు తీసుకెళ్లాలి? ఏం చేద్దాం అనేది నాకు పూర్తిగా ఐడియా లేదు. నేను పూర్తిగా పొలిటికల్ ప్రాసెస్‌లో ఉండి సినిమా రిలీజ్ గురించి నాకు తెలియదు, నేను పట్టించుకోలేదు. చాలా సంవత్సరాలు అయిపోయింది అలా పట్టించుకోకుండా. ఆ టైంలో రత్నం గారికి అండగా మైత్రి మూవీ మేకర్స్ నవీన్, రవి, అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ ముందుకొచ్చి సహకరించి రిలీజ్‌కి సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను.

Also Read:Pawan Kalyan: ఇంకా వీరమల్లును వదలని పవన్..

ఎందుకంటే వారు లేకపోయి ఉంటే ఈ రోజున ఖచ్చితంగా ఈ రిలీజ్ చాలా కష్టమయ్యేది. మాకు డిప్యూటీ సీఎం బ్యాక్‌గ్రౌండ్ ఉండి ఉండవచ్చు, కానీ సినిమా అనేది సినిమా. ఎందుకంటే దీంతో చాలా ఫైనాన్స్ కూడి ఉంటుంది. ఫైనల్‌గా మా సినిమాకి ఫైనాన్షియల్‌గా అందర్నీ సపోర్ట్ చేసినందుకు థాంక్స్ చెబుతున్నాను. టెక్నికల్ పర్సన్స్, ల్యాబ్స్ పర్సన్స్ అందరికీ పేరుపేరునా సహకరించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు,” అని పవన్ అన్నారు.

Exit mobile version