OG 2: ‘ఓజీ’ యూనివర్స్‌లో నేతాజీ సుభాష్ చంద్రబోస్.. సుజీత్ ప్లాన్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

Og 2

Og 2

OG 2: సోషల్ మీడియాలో ‘ఓజీ’ యూనివర్స్‌ చుట్టూ రోజుకో ఆసక్తికరమైన వార్త నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. సుజీత్ డైరెక్షన్‌లో గతంలో వచ్చిన ఓజీ సినిమా బాక్సాఫీస్ వద్ద అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ – సుజీత్ కాంబోలో రాబోతున్న ఓజీ 2 అప్డేట్స్ గురించి పవర్ స్టార్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా స్టోరీ గురించి స్వయంగా డైరెక్టర్ సుజీత్ హీరో పవన్ కళ్యాణ్‌ను కలిసి చర్చించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా కథకు సంబంధించి ఒక సెన్సేషనల్ లీక్ ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రంలో కేవలం ముఠా రాజకీయాలే కాకుండా, దేశభక్తి బ్యాక్‌డ్రాప్‌తో కూడిన ఒక భారీ చారిత్రాత్మక అంశం కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం.. ఓజీలో కథ 1940లలో మొదలై, 1973 ప్రాంతంలో సాగుతూ 1993లో ముగుస్తుంది. అయితే ‘ఓజీ సీక్వెల్’ లో 1940ల నాటి కాలానికి సంబంధించిన పూర్తి కథను చూపించబోతున్నారట. ఇక్కడే దర్శకుడు సుజీత్ ఒక ఊహించని ట్విస్ట్ ప్లాన్ చేసినట్లు టాక్. స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎలిమెంట్‌ను ఈ స్టోరీకి ముడిపెట్టినట్లు తెలుస్తోంది. 1940లలో ఆజాద్ హింద్ ఫౌజ్ (INA) కోసం నేతాజీ దాచిన రహస్య నిధులు లేదా ఆ కాలం నాటి ఒక కీలకమైన మిస్టరీ చుట్టూనే హీరో ‘ఓజీ’ (పవన్ కళ్యాణ్) ప్రయాణం సాగుతుందని ఇండస్ట్రీ టాక్. ఈ చారిత్రాత్మక లింక్ సినిమా స్థాయిని, పవన్ కళ్యాణ్ క్యారెక్టరైజేషన్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తుందని అంటున్నారు. దీనిపై చిత్ర బృందం నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ క్రియేటీవ్ వర్క్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.