Site icon NTV Telugu

Pawan Kalyan : సజ్జనార్ కు పవన్ అభినందనలు

Sajjanar

Sajjanar

సినిమా పరిశ్రమకు శాపంగా మారిన పైరసీ ముఠాపై హైదరాబాద్ పోలీసులు సాధించిన విజయం యావత్ భారతీయ సినీ రంగానికి ఊరటనిచ్చింది అని పవన్ కళ్యాణ్ అన్నారు. డబ్బుల రూపంలోనే కాక, సృజనాత్మకతను పెట్టుబడిగా పెట్టి నిర్మించిన సినిమాలు విడుదలైన రోజునే ఇంటర్నెట్‌లో పోస్ట్ అవుతుండటం వల్ల చిత్ర పరిశ్రమ తీవ్రంగా నష్టపోతున్న తరుణంలో, ఈ కట్టడి చర్యలు స్వాగతించదగినవని ఆయన అన్నారు.

Also Read :Mega Star : ఐ – బొమ్మ వాళ్లు సవాళ్లు విసురుతుంటే తట్టుకోలేకపోయా

సినిమా విడుదలను ఒక మహా యజ్ఞంగా భావించే దర్శకనిర్మాతలకు పైరసీ ముఠాలను అరికట్టడం సాధ్యం కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో, పైరసీకి కీలక కేంద్రాలుగా ఉన్న ఐబొమ్మ (iBomma), బప్పమ్ (Bappam) వెబ్‌సైట్ల నిర్వాహకుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసి, అతని చేతనే వాటిని మూసివేయించడం ఒక చారిత్రక ఘట్టం అని పవన్ అన్నారు. పోలీసులకే సవాల్ విసిరే స్థాయికి పైరసీ ముఠాలు చేరుకున్న తరుణంలో, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసు బృందం చేపట్టిన ఈ ఆపరేషన్ విజయవంతమైంది**. ఈ సందర్భంగా, ఈ ఆపరేషన్‌లో భాగమైన పోలీసులకు, అలాగే సిటీ కమిషనర్ సజ్జనార్ కి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

Also Read :Nagarjuna: అక్కినేని నాగార్జున ఇంట్లో డిజిటల్ అరెస్ట్ అయిందెవరు?

సజ్జనార్ నేతృత్వంలో చేపట్టే చర్యలు కచ్చితంగా తెలుగు సినిమాకే కాదు, యావత్ భారతీయ చిత్ర పరిశ్రమకు మేలు చేస్తాయని పవన్ కళ్యాణ్ అన్నారు. సజ్జనార్ కేవలం సినిమా పైరసీపైనే కాకుండా, బెట్టింగ్ మాఫియా, పొంజీ స్కీమ్స్ వంటి వాటిపై కూడా ప్రత్యేక దృష్టి సారించడం అభినందనీయం. ఈ మోసాల వల్ల ప్రజలు ఆర్థికంగా ఏ విధంగా చితికిపోతున్నారో చైతన్యపరుస్తున్నారని పవన్ తెలిపారు. పొంజీ స్కీమ్స్ మూలంగా ప్రజలు ఆర్థికంగా మోసానికి గురై నష్టపోతున్న విధానాన్ని సజ్జనార్ ఒక సందర్భంలో వివరించారని ఆయన గుర్తు చేశారు. అలాగే, బెట్టింగ్ యాప్స్‌ను నియంత్రించేందుకు శ్రీ సజ్జనార్ చేపట్టిన కార్యక్రమం **అన్ని రాష్ట్రాల్లోనూ కదలిక తీసుకువచ్చింద**ని శ్రీ పవన్ కళ్యాణ్ కొనియాడారు.

Exit mobile version