Pawan Kalyan : ఓజీ 2 ఈజ్ ఆన్.. పవన్ ఫ్యాన్ కి పండుగ లాంటి న్యూస్

Og2

Og2

టాలీవుడ్‌లో గత కొన్ని రోజులుగా పవర్ స్టార్, డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇవ్వబోతున్నారంటూ రకరకాల వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిజల్ట్ తర్వాత ఆయన యాక్టింగ్ కు ఫుల్ స్టాప్ పెట్టే ఆలోచనలో ఉన్నారని, రాజకీయాలపైనే పూర్తి ఫోకస్ పెట్టబోతున్నారనే ప్రచారం మెగా అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. అయితే, ఈ రూమర్లన్నింటికీ చెక్ పెడుతూ ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ అఫీషియల్ అకౌంట్ నుంచి ఒక సాలిడ్ ట్వీట్ వచ్చింది.

పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరం కాబోతున్నారనే వార్తలకు తమ ట్వీట్ ద్వారా గట్టి కౌంటర్ ఇచ్చింది క్రియేటివ్ వర్క్స్ టీమ్. “మాటిచ్చినట్టుగానే ఆయన (పవన్ కళ్యాణ్) సినిమా చేస్తారు. ఆ సమయం ఎప్పుడనేది ఆయనే స్వయంగా ప్రకటిస్తారు. డైరెక్టర్ సుజీత్ విదేశాల నుంచి తిరిగి రాగానే.. మేము ‘ఓజీ 2’ #OG2 ప్రాజెక్ట్ గురించి చర్చలు జరుపుతాము” అంటూ అధికారికంగా క్లారిటీ ఇచ్చారు. ‘ఓజీ’ మొదటి భాగం షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు సిద్ధమవుతున్న తరుణంలోనే, డైరెక్టర్ సుజీత్ నానితో ‘బ్లడీ రోమియో’ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్యారడైజ్ లేట్ కావడంతో ఆ సినిమా లేటు అయ్యే అవకాశం ఉందని అనుకున్నారు. అయితే ప్రస్తుతం సుజీత్ విదేశీ పర్యటనలో ఉన్నారని, ఆయన ఇండియాకు తిరిగి రాగానే పవన్ కళ్యాణ్‌తో కూర్చుని ‘ఓజీ 2’ కథా చర్చలు, షూటింగ్ షెడ్యూల్స్ పై ఒక స్పష్టతకు రానున్నారని ఈ ట్వీట్ ద్వారా స్పష్టమైంది. ఈ అధికారిక ప్రకటనతో పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరం కావడం లేదని, కాకపోతే పొలిటికల్ షెడ్యూల్స్, తన హెల్త్ కండిషన్‌ను బట్టి కాస్త సమయం తీసుకుని సరైన టైమింగ్‌లో ప్రేక్షకుల ముందుకు వస్తారని తేలిపోయింది. దీంతో గత కొద్ది గంటలుగా టెన్షన్‌లో ఉన్న మెగా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు.

×
×
Ad