NTV Telugu Site icon

Pawan Kalyan: బాలయ్య అనే పిలువు అంటారు కానీ ఎపుడూ సార్ అనే పిలివాలి అనిపిస్తుంది!

ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ నేతృత్వంలో ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా బాధితులకు సహాయం చేసేందుకు నిర్వహించిన మ్యూజికల్ నైట్ ప్రొగ్రాంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ కలుసుకున్నారు. సరదాగా మాట్లాడుకున్నారు. ఎన్టీఆర్ ట్రస్టుకు పవన్ కళ్యాణ్ రూ. 50 లక్షలు విరాళం ప్రకటించారు. ఇక బాల‌య్య గురించి పవన్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. బాల‌య్య ఎప్పుడూ త‌న‌ను బాల‌య్యా అని పిల‌వ‌మని అంటుంటార‌ని.. కానీ త‌న‌కు మాత్రం అలా పిల‌వ‌బుద్ధి కాద‌ని.. ఆయ‌న త‌న‌కు ఎప్పుడూ సారే అని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. దీంతో స‌భా ప్రాంగ‌ణంలో హ‌ర్షాతిరేకాలు వ్య‌క్త‌మ‌య్యాయి. త‌న ప్ర‌సంగాన్ని కొన‌సాగిస్తూ బాల‌య్య ఏదో ఒక త‌రంతో ఆగిపోకుండా కొన్ని త‌రాలుగా ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూనే ఉన్నార‌ని ప‌వ‌న్ అన్నారు.

NTR Trust Euphoria Musical Night: యుఫోరియా కన్సర్ట్’కి బాలయ్య, పవన్.. ఫ్రేమ్ అదిరిందిగా!

ఆయ‌న న‌ట‌న అంద‌రికీ ఆనందాన్నిస్తుంద‌న్న పవన్ న‌ట‌న‌కే ప‌రిమితం కాకుండా సేవా కార్య‌క్ర‌మాల‌తో కూడా బాల‌య్య ఎంతో పేరు తెచ్చుకున్నార‌ని అందుకే న‌రేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం ఆయ‌న్ని ఇటీవ‌ల ప‌ద్మ‌భూష‌ణ్ పుర‌స్కారంతో గౌర‌వించింద‌ని అన్నారు. బాల‌య్య ఇప్పుడు జ‌స్ట్ బాల‌య్య కాద‌ని, ప‌ద్మ‌భూష‌ణ్ బాల‌కృష్ణ అని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. ఇక ఎన్టీఆర్ ట్రస్ట్ చేప‌డుతున్న సేవా కార్య‌క్ర‌మాల గురించి కూడా ప‌వ‌న్ కొనియాడారు. 28 ఏళ్లుగా ఈ ట్ర‌స్టు కార్య‌క్ర‌మాలు కొన‌సాగుతున్నాయ‌ని ఎన్టీఆర్ పేరు మీద‌ పెద్ద‌గా ప‌బ్లిసిటీ లేకుండా సైలెంటుగా త‌మ ప‌ని తాము చేసుకుపోతుంటార‌ని ప‌వ‌న్ చెప్పుకొచ్చారు.