పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. పవన్ కళ్యాణ్ నాలుగు సినిమాలను ఒకేసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నాడు.. అందులో ఒకటి ‘OG ‘ కూడా ఒకటి..ప్రభాస్ సాహో దర్శకుడు..సుజీత్ ఈ ప్రాజెక్టుని చాలా స్టైలిష్ గా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే..ఈ సినిమాకు ఒరిజినల్ గ్యాంగస్టర్ టైటిల్ ను ఫిక్స్ చేశారు.. ఈ టైటిల్ ఇప్పటికే జనాల్లోకి వెళ్ళిపోయింది. ఆర్ఆర్ఆర్ నిర్మాత డీవీవీ దానయ్య ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది.. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర పేరు ఇదే నంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది.. ఈ చిత్రంలో పవన్ పాత్ర పేరు గాంధీ అని తెలుస్తోంది. క్యారక్టర్ పరంగా చూస్తేనేమో గ్యాంగస్టర్.. కానీ గాంధీ పేరు పెట్టడంతో.. అసలు ఈ చిత్రంలో పవన్ అసలు పాత్ర ఏంటి? ఎలాంటి లుక్‌లో కనిపిస్తారు? అనే చర్చ జరుగుతోంది… అయితే ఈ సినిమాను త్వరగా కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తుంది..
గ్యాంగస్టర్ డ్రామా గా జరిగే ఈ చిత్రం ఓ ట్విస్ట్ తో నడవనుంది. ఓ రకంగా ఇది సుజీత్ కు ఛాలెంజింగ్ మూవీ, ప్రభాస్ తో చేసిన సాహో మూవీ పరాజయం తర్వాత సుజీత్ అదిరిపోయే రీతిలో రీ ఎంట్రీ ఇవ్వాలని అనుకున్నాడు. తనను తాను నిరూపించుకోవాలని అనుకుని చేసిన స్క్రిప్టు ఇది. పవన్ సినిమా తనకు వచ్చిన గోల్డెన్ ఆఫర్ గా భావించి స్క్రిప్టుపై బాగా వర్కౌట్ చేశాడని చెప్తున్నారు. ఈ మూవీ లో పవన్ గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.. ఇక హీరోయిన్ గా ప్రియాంక మోహన్ నటిస్తుంది.. మూడో సినిమాకే పవన్ తో ఛాన్స్ కొట్టేసింది.. ఈ సినిమాకు రెమ్యూనరేషన్ కూడా భారీగానే ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక సినిమా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..