Site icon NTV Telugu

Pawan Kalyan : ‘OG’ మూవీలో మరో హీరోయిన్..!

Og

Og

పవన్ కళ్యాణ్ వెండితెరపై కనిపించి చాలా కాలమైంది. 2023లో ‘బ్రో’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన ఆయన నెక్ట్స్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్స్ తో అలరించేందుకు రెడీ అవుతున్నారు. కాగా పవన్ కల్యాణ్ లైనప్ అరడజను సినిమాలు అయితే ఉన్నాయి. ఇందులో ‘ఓజీ’ ఒకటి. సుజీత్ దర్శకత్వం వహింస్తుండగా, డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తుండ‌గా, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాశ్ రాజ్, హరీశ్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ తదితరులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇక తాజాగా ఈమూవీకి సంబంధించిన క్రేజీ అప్‌డేట్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది.

Also Read : Pawan Kalyan : కిక్కెక్కిస్తున్న ‘వీరమల్లు’ రొమాంటిక్ సాంగ్..

చంద్రబాబు నాయుడు తమ్ముడికి కాబోయే కోడలు నటి సిరి లేళ్ళ ఈ మూవీలో ముఖ్య పాత్ర చేయ‌నుంద‌ట‌. త్వర‌లో నారా రోహిత్‌ని వివాహం చేసుకొని కోడ‌లిగా వెళ్లనున్న సిరి గ‌తంలో నారా రోహిత్ నటించిన ‘ప్రతినిధి-2’ మూవీలో హీరోయిన్‌గా నటించింది. కాగా ఈ సినిమా సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమ‌గా మారింది. రీసెంట్ గానే వీరి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. కానీ ఇటీవ‌ల నారా రోహిత్ తండ్రి మరణించడంతో ఈ పెళ్లి వాయిదా పడింది. ఇక ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓజీలో కీల‌క పాత్రలో క‌నిపించి సంద‌డి చేయ‌నున్నట్టు వార్తలు వ‌స్తున్నాయి. ఈ వార్త గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

Exit mobile version