పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, దర్శకులు క్రిష్ జాగర్లమూడి అలాగే జ్యోతి కృష్ణలు తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘హరిహర వీరమల్లు’. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ఎప్పుడో రావాల్సింది.. కానీ ఎన్నో ఇబ్బందులు ఎదురుకొని ఫైనల్‌గా ఈ జూన్ 12న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కాబోతుంది. ఇక విడుదల సమయం దగ్గర పడుతుండడంతో, ఒక్కో అప్ డేట్ వదులుతున్నారు మూవీ మేకర్స్. కాగా ఇప్పటికే మూడు పాటలు రిలీజ్ కాగా, తాజాగా సినిమా నుంచి నాలుగో సాంగ్ కూడా విడుదలైంది.
Also Read :Mirai : అదిరిపోయిన ‘మిరాయ్’ టీజర్.. లాస్ట్ షాట్ గూస్ బంప్స్ అంతే
ఇక ఈ సాంగ్ లో నిధి లుక్ అదిరిపోయింది. లిరిక్స్ బ్యాగ్రౌండ్ స్మూత్‌గా కిక్కిచ్చేలా ఉందని చెప్పాలి. కీరవాణి మంచి ట్యూన్‌ని అందించగా శ్రీహర్ష ఈమని ఇచ్చిన సాహిత్యం కూడా బాగుంది. ఇక ఈ సాంగ్ లో లిప్సిక భాష్యం గొంతు, బాగా ప్లస్ అయ్యిందని చెప్పాలి. అలాగే సాంగ్ లో విజువల్స్ కూడా ఒకింత ఆశ్చర్యకరంగా ఉన్నాయి. సాంగ్ మూడ్ కి తగ్గట్టుగా సెట్ చేసిన సెట్టింగ్స్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక నిధి అగర్వాల్ అయితే మెయిన్ ఎసెట్ అని చెప్పవచ్చు. తన గ్లామర్ ఇంకా తన డాన్స్ మూమెంట్స్ సాంగ్ లో చాలా బాగున్నాయి. మొత్తానికి నాలుగో పాట కూడా అదిరిపోయింది.