NTV Telugu Site icon

Pawan Kalyan : పవన్ నోటి నుంచి అల్లు అర్జున్ పేరు.. ఏమన్నారంటే..?

Pavan

Pavan

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అర్జున్ పేరును మరోసారి ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్న పల్లెపండగ కార్యక్రమంలో భాగంగా కంకిపాడులో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ సినిమాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ” ముందు రాష్ట్రాభివృద్ధి చేయాలి, అది మన బాధ్యత , ఆ తర్వాతే సినిమాలు. టాలీవుడ్‌లో ఎవరితోనూ నేను పోటీపడను నేను సినిమా చేయాలంటే డబ్బులు కూడా ఉండాలి. సినిమా హీరోలు ఎవరైనా బాగుండాలని కోరుకుంటా. సినిమా ఇండస్ట్రీ బాగుండాలంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగుండాలి. రాష్ట్రాన్ని బాగుచేసుకుని ఆ తర్వాత విందులు, వినోదాలు చేసుకుందాం” అని అన్నారు.

Also Read : NAGABANDHAM : మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా.. పెదకాపు హీరోగా..

అలాగే నాకు సినిమా అంటే చాలా గౌరవం, ప్రేమ. తనకు ఏ హీరో పైన భిన్నాభిప్రాయం లేదు. అందరి హీరోలను గౌరవిస్తాను, తెలుగు సినిమా హీరోలైన బాలకృష్ణ, చిరంజీవి, జూనియర్ ఎన్టీయార్, మహేష్ బాబు, అల్లు అర్జున్, నేచురల్ స్టార్ నాని, రామ్ చరణ్ కావొచ్చు  యల్ అందరు హీరోలు బాగుండాలి అని కోరుకుంటాను. అయితే సినిమా రంగం అభివృద్ధి చెందాలంటే ముందుగా రాష్ట్రాభివృద్ధి అవసరం, ఆర్థికంగా అందరం బలోపేతం  కావాలి. జాతీయ ఉపాధి హామీ పనుల ద్వారా ఆదాయం పొందవచ్చని పవన్ కల్యాణ్ తెలిపారు. దీంతో పాటు సినిమాకు వెళ్లాలంటే రహదారులు బాగా ఉండాలని, వాటిని అభివృద్ధి చేసుకోవడంపైనే ముందు దృష్టిపెడదామన్నారు. పల్లె పండగ కార్యక్రమంలో భాగంగా సుమారు రూ. 4500 కోట్లతో 30 వేల పనులకు శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు పవన్ కళ్యాణ్.