Patriot : పేట్రియాట్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇండస్ట్రీ హిట్ లోడింగ్.. కానీ తెలుగు రిలీజ్ డౌటే
లాలట్టన్ అండ్ మమ్మూక 18 ఏళ్ల తర్వాత పేట్రియాట్ మూవీతో వస్తున్నారు. మహేశ్ నారాయణన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ చిత్రం మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. గతంలో ‘ట్వంటీ:20’ వంటి చిత్రంలో కలిసి నటించిన ఈ ఇద్దరు స్టార్స్, మళ్లీ ఇన్నాళ్లకు ఒకే ఫ్రేమ్‌లో కనిపించబోతున్నారు. మమ్ముట్టి ఇందులో ‘డాక్టర్ డేనియల్ జేమ్స్’గా, మోహన్ లాల్ ‘కల్నల్ రహీమ్ నాయక్’గా పవర్‌ఫుల్ రోల్స్ పోషిస్తున్నారు. ఫహద్ ఫాజిల్, నయనతార వంటి స్టార్ కాస్టింగ్ కూడా ఉండటంతో ఈ సినిమాపై బిజినెస్ వర్గాల్లో భారీ క్రేజ్ నెలకొంది.
అయితే ఈ సినిమా విషయంలో ఫ్యాన్స్ కొంత అసంతృప్తిగా ఉన్నారు. అదే ప్రమోషన్ల కొరత. మాలీవుడ్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ లో ఇప్పటికే రూ. 13 కోట్లకు పైగా రాబట్టి దూసుకెళ్తున్న ఈ సినిమా తెలుగులో మాత్రం కనీసం ఒక చిన్న ఈవెంట్ కానీ ప్రెస్ మీట్ కానీ నిర్వహించలేదు. ‘పేట్రియాట్’ పేరుతో పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేస్తామని ప్రకటించిన మేకర్స్, తెలుగు ఆడియన్స్‌కు కనీస సమాచారం ఇవ్వకపోవడం చర్చనీయాంశమైంది. మే 1న తెలుగు వెర్షన్ విడుదల అవుతుందో లేదో అన్న సందిగ్ధంలో ఫ్యాన్స్ ఉన్నారు. ప్రచార ఆర్భాటం లేకుండానే నేరుగా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాలని మేకర్స్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం మాలీవుడ్‌లో ‘లోక: చాప్టర్ 1‘ సుమారు రూ. 304 కోట్ల వసూళ్లతో హయ్యెస్ట్ గ్రాసర్‌గా ఉంది. ఆ తర్వాత వాలా 2, ‘తుడరుమ్’, ‘2018’ వంటి చిత్రాలు టాప్ లిస్టులో ఉన్నాయి. అయితే ‘పేట్రియాట్’ అడ్వాన్స్ బుకింగ్స్ మరియు టాక్ చూస్తుంటే ఈ చిత్రం మాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఈ ఇద్దరు లెజెండ్రీ హీరోలు కలిసి పాత రికార్డులను తుడిచేస్తారో లేదో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Patriot : పేట్రియాట్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇండస్ట్రీ హిట్ లోడింగ్.. కానీ తెలుగు రిలీజ్ డౌటే
-
MI vs SRH: వాంఖడే చరిత్రలోనే ముంబై ఇండియన్స్ చెత్త రికార్డు.. కన్నీరు పెట్టిన నీతా అంబానీ!
-
Motorola Moto G87: 200MP కెమెరా, 5200mAh బ్యాటరీతో మోటో G87 విడుదల
-
Software Engineer Suicide: మా కోడలికి ఆరుగురు బాయ్ ఫ్రెండ్స్.. ప్రవర్తన నచ్చకే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. తండ్రి ఆవేదన.!
-
AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
ట్రెండింగ్
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!