Site icon NTV Telugu

Parasakthi Release: శివకార్తికేయన్‌ ‘పరాశక్తి’కి లైన్ క్లియర్!

Sivakarthikeyan Parasakthi

Sivakarthikeyan Parasakthi

సుధ కొంగర దర్శకత్వంలో తమిళ్ హీరో శివకార్తికేయన్‌ కథానాయకుడిగా రూపొందిన సినిమా ‘పరాశక్తి’. డాన్‌ పిక్చర్స్‌ రూ.150 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రంను నిర్మించింది. శివకార్తికేయన్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ పీరియడ్ డ్రామా జనవరి 10న రిలీజ్ కానుంది. అయితే గురువారం రాత్రి వరకూ సెన్సార్‌ సర్టిఫికెట్‌ రాకపోవడంతో.. పరాశక్తి రిలీజ్ అవుతుందా? లేదా? అన్న దానిపై అందరిలో సందిగ్ధత నెలకొంది. ఆ సందిగ్ధతకు ఈరోజు తెరపడింది.

Also Read: T20 World Cup 2026: తిలక్‌ వర్మ దూరమైతే.. ప్రపంచకప్‌కు టీమిండియా ప్లేయింగ్‌ ఎలెవన్‌ ఇదేనా?

ఈరోజు ఉదయం పరాశక్తి మూవీకి సెన్సార్‌ బోర్డు ‘యూ/ఏ’ సర్టిఫికెట్‌ ఇచ్చింది. దీంతో చిత్ర యూనిట్ ఊపిరి పీల్చుకుంది. షెడ్యూల్ ప్రకారమే జనవరి 10న సినిమా రిలీజ్ కానుంది. విషయం తెలిసిన శివకార్తికేయన్‌ ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల కానుంది. 1960లలో తమిళనాడులోని హిందీ వ్యతిరేక నిరసనల నేపథ్యంతో ఇద్దరు స్నేహితుల చుట్టూ తిరిగే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. పరాశక్తిలో శ్రీలీల, రవిమోహన్, అథర్వ మురళీ కీలక పాత్రల్లో నటించారు.

Exit mobile version