Paranormal Activity: పెట్టింది రూ.12 లక్షలు.. కొల్లగొట్టింది రూ.16 వేల కోట్లు! సినిమా చరిత్రలోనే అతిపెద్ద మిరాకిల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Paranormal Activity: నిజానికి హాలీవుడ్ అనగానే మనకు వేల కోట్ల బడ్జెట్ సినిమాలు గుర్తొస్తాయి. కానీ కేవలం కొన్ని లక్షల రూపాయలతో తీసిన ఒక చిన్న సినిమా.. వేల కోట్ల రూపాయలను కొల్లగొట్టి ప్రపంచ సినిమా చరిత్రలోనే ఒక అద్భుతం సృష్టించిందని మీలో ఎంత మందికి తెలుసు. ఆ సినిమానే ‘పారానార్మల్ యాక్టివిటీ’ (Paranormal Activity). ‘సినిమా ఆడాలంటే స్టార్ హీరో లేదా వందల కోట్ల బడ్జెట్ ఉండాలి’ అని అప్పటి వరకు సినిమా రంగంలో ఉన్న ఒక లాంటి నమ్మకాన్ని ఈ సినిమా తప్పని నిరూపించింది. కేవలం రూ.12 లక్షల బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా రూ.1600 కోట్ల వసూల్లు చేసి.. సినిమా చరిత్రలోనే అతిపెద్ద రికార్డ్‌ను సృష్టించింది.
2007లో విడుదలైన ఈ హారర్ చిత్రం.. అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. నేటికీ అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన చిత్రంగా ఇది రికార్డుల్లో నిలిచిపోయింది. ఈ చిత్రాన్ని దర్శకుడు ఓరెన్ పెలి కేవలం 15,000 డాలర్ల (భారతీయ కరెన్సీలో సుమారు రూ.12 లక్షల) వ్యయంతో నిర్మించారు. నిజానికి ఈ సినిమాలో అగ్ర నటీనటులు లేరు, భారీ సెట్టింగ్‌లు కూడా లేవు. కేవలం ఒకే ఒక్క ఇంట్లో, అతి తక్కువ మంది టెక్నీషియన్లతో కేవలం వారం రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేశారు. కానీ ఈ సినిమా సాధించిన విజయం మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ దిగ్గజాలను కూడా ఆశ్చర్యపరిచింది.
Also Read
- Shwetha Menon: మలయాళ 'అమ్మ'లో సంక్షోభం.. అధ్యక్షురాలు సహా మొత్తం కార్యవర్గం రాజీనామా!
- Sukumar: డైరెక్టర్ సుకుమార్‌ను కలిసిన ప్రియదర్శి మూవీ టీమ్.. హీరోయిన్ ఎవరో తెలుసా?
- Sai Durga Tej: ‘మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తోంది’.. హనుమాన్ 3Dపై సుప్రీం హీరో క్రేజీ రివ్యూ!
- OG 2: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. స్టార్ట్ అయిన ‘OG 2’ స్క్రిప్ట్ డిస్కషన్స్!
సినిమా కథ ఇదే..
ఒక జంట తమ ఇంట్లో జరిగే వింత సంఘటనలను కెమెరాలో రికార్డ్ చేయడం.. ఆ విజువల్స్ చూసి ప్రేక్షకులు థ్రిల్ అవ్వడం.. ఇదే ఈ సినిమా కథ. ‘ఫౌండ్ ఫుటేజ్’ శైలిలో చిత్రీకరించిన విధానం ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతినిచ్చింది. ఇందులో చూపించిన భయానక దృశ్యాలు ఎంత సహజంగా ఉన్నాయంటే, థియేటర్లలో కూర్చున్న ప్రేక్షకులు నిజంగానే తమ కళ్లముందు ఏదో జరుగుతోందని భయపడిపోయారు. ముందుగా కొన్ని స్క్రీన్‌లలోనే రిలీజ్ అయిన ఈ చిత్రం, మౌత్ టాక్‌తో సంచలనం సృష్టించింది. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో దీనికి అనేక సీక్వెల్స్ కూడా వచ్చాయి. హారర్ సినిమాల్లో ఒక సరికొత్త ట్రెండ్‌ను సెట్ చేసిన ఈ చిత్రం, నేటికీ ఒక పాఠం లాంటిది. కథలో బలం ఉండాలే కానీ, బడ్జెట్‌తో పనిలేదని ‘పారానార్మల్ యాక్టివిటీ’ నిరూపించింది.
తాజావార్తలు
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్‌బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Virat Kohli: మళ్లీ టెస్టుల్లోకి విరాట్ కోహ్లీ..? జూలై 14 నుంచి మైదానంలోకి కింగ్..
-
Badangpet Warehouse Blast: బడంగ్పేట్లో ఘోరం.. డెకరేషన్ గోదాంలో కెమికల్ బాక్స్ పేలి కార్మికుడు మృతి.!
-
Sahan: మా బౌలర్లు బెంబేలెత్తిపోయారు.. అది బ్యాటింగ్ అంటారా..? విధ్వంసం: శ్రీలంక కెప్టెన్ సహన్
-
Cucumber Idli: బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్.. కేవలం నిమిషాల్లో దోసకాయ ఇడ్లీ ఇలా చేసేయండి!
ట్రెండింగ్
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!