The Paradise : రూ.100 కోట్లు పలికిన ప్యారడైజ్ థియేట్రికల్ రైట్స్.. కానీ రికవరీ పరిస్థితి ఏంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చిత్రపరిశ్రమలో మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న నేచురల్ స్టార్ నాని, తన మార్కెట్ రేంజ్ మరియు థియేట్రికల్ బిజినెస్‌ను అనూహ్యంగా పెంచుకున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘దసరా‘ సినిమా నుంచి అదే కాంబినేషన్లో వస్తున్న భారీ యాక్షన్ చిత్రం ‘ది ప్యారడైజ్‘ వరకు నాని తెలుగు థియేట్రికల్ హక్కుల మార్కెట్ దాదాపు మూడు రెట్లు పెరగడం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
2023లో విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న ‘దసరా’ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ వ్యాపారం సుమారు రూ. 30 కోట్లు మాత్రమే జరిగింది. ఇప్పుడు దాదాపు మూడేళ్ళ తర్వాత శ్రీకాంత్ ఓదెల-నాని కాంబో రిపీట్ అవుతున్న ‘ది ప్యారడైజ్’ చిత్రానికి తెలుగు థియేట్రికల్ మరియు ఓవరాల్ థియేట్రికల్ మార్కెట్ వాల్యూ కలిపి ఏకంగా రూ. 100 కోట్లకు పైగా ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. వరస విజయాలతో పాటు కథల ఎంపికలో చూపిస్తున్న వైవిధ్యం నాని మార్కెట్‌ను టైర్ 2 రేంజ్ నుండి టైర్ 1కు సమానమైన స్థాయికి తీసుకెళ్లింది. ‘దసరా’ తెచ్చిపెట్టిన గ్లోబల్ క్రేజ్, శ్రీకాంత్ ఓదెల అందించే మాస్ ఎమోషనల్ మేకింగ్ మైత్రీ మూవీ మేకర్స్ వంటి ప్రముఖ పంపిణీదారులు భారీ ధరకు నైజాం హక్కులను దక్కించుకోవడం ఈ భారీ వ్యాపారానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. అయితే ప్యారడైజ్ రికవరీ ఏ రేంజ్ వరకు ఉంటుందనేది ఇప్పుడు ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఓపెనింగ్ డే మంచి అవకాశం ఉందని టాక్ ని బట్టి రన్నింగ్ ఉంటుందని భారీ ధరకు కొనుగోలు చేయడం కాస్త రిస్క్ అని డిస్ట్రిబ్యూటర్స్ సర్కిల్స్ లో వినిపిస్తున్న గుసగుస.
Also Read
- Mandakini: ఆ ఒక్క ఫోటోతో నా కెరీర్ నాశనమైంది.. 30 ఏళ్ల దావూద్ వివాదంపై మౌనం వీడిన మందాకిని
- Quick Style: హైదరాబాద్‌కు వరల్డ్ ఫేమస్ డ్యాన్స్ ట్రూప్.. నవంబర్ 1న అదిరిపోయే డ్యాన్స్ షో!
- Suhas : హీరో సుహాస్ రంగు చూసి విమర్శించిన తెలుగు వాడెవడు?
- Raaka: అల్లు అర్జున్ ‘రాకా’పై సన్ పిక్చర్స్ సర్ప్రైజ్ పోస్టర్.. ఆ 37 నంబర్ వెనుక అసలు ట్విస్ట్ ఏంటి?
తాజావార్తలు
-
The Paradise : రూ.100 కోట్లు పలికిన ప్యారడైజ్ థియేట్రికల్ రైట్స్.. కానీ రికవరీ పరిస్థితి ఏంటి?
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
-
Mandakini: ఆ ఒక్క ఫోటోతో నా కెరీర్ నాశనమైంది.. 30 ఏళ్ల దావూద్ వివాదంపై మౌనం వీడిన మందాకిని
-
Layoffs: 45ఏళ్లు దాటితే ఉద్యోగం ఊస్ట్? అంకుల్స్‌ను భయపెడుతున్న లెక్కలు!
-
Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
ట్రెండింగ్
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!
-
Shreyas Iyer: అది నేను ముందే ఊహించా.. ఆ ఐదుగురు సూపర్.. శ్రేయాస్ సంతోషం!
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!