Site icon NTV Telugu

Papa Movie: తెలుగులో విడుదలకు సిద్దమైన ఎమోషనల్ మూవీ ‘పా..పా..’

Papa

Papa

టాలీవుడ్‌లో చిన్న సినిమాల సంఖ్య భాగా తగ్గిపోయింది. అందుకే ఈ మధ్య కాలంలో తమిళ, మళయాళ, కన్నడ చిత్రాలు తెలుగులో మంచి ఆదరణ పొందుతున్నాయి. అయితే  2023 ఫిబ్రవరిలో రిలీజై తమిళ బ్లాక్ బ‌స్టర్ చిత్రం ‘దాదా’ ఎలాంటి విజయం అందుకుందో తెలిసిందే. చిన్న సినిమాగా వచ్చి ఎమోషనల్ కంటెంట్ తో కోట్లు కొల్లగొట్టింది. కోలీవుడ్ యంగ్ హీరో కవిన్ ప్రధాన పాత్రలో న‌టించిన ఈ మూవీ ఓటీటీకి వ‌చ్చిన అనంత‌రం ఇక్కడ కూడా రికార్డు వ్యూస్ సాధించింది. ఇక భాషతో సంబంధంలేకుండా ఈ సినిమాను అన్ని రాష్ట్రాల సినీ లవర్స్‌ దాదాపుగా చూసేసారు.  కానీ తెలుగు ప్రేక్షకులు తప్ప.. దీంతో తాజాగా  ఈ సినిమాను ‘పా..పా..’ పేరుతో తెలుగులో డ‌బ్ చేసి జూన్ 13 విడుద‌ల చేస్తున్నారు.

Also Read : Pooja Hegde : విజయం కోసం కాస్త ఓపిక పట్టాలి..

దీంతో రీసెంట్ మూవీ కి సంబంధించిన తెలుగు ట్రైలర్ విడుదల చేయగా, ట్రైలర్ లో హీరో హీరోయిన్ మధ్య లవ్ సీన్స్ ఎంతో ఆకట్టుకోగా.. అలా సాగిన కథలో వారిద్దరి మ‌ధ్య సాన్నిహిత్యం కార‌ణంగా హీరోయిన్‌కు ప్రెగ్నెన్సీ వ‌స్తుంది. అయితే ఆ ప్రెగ్నెన్సీ ని.. అబార్షన్ చేయించుకోమ‌ని మ‌ణికంద‌న్ (హీరో) స‌ల‌హా ఇస్తాడు. కానీ సింధు (హీరోయిన్) అందుకు ఒప్పుకోదు. దాంతో పెళ్లి కాకుండానే హీరోయిన్‌తో పాటు ఆమెకు పుట్టబోయే బిడ్డ బాధ్యత హీరోపై ప‌డుతుంది. తర్వాత వీరు ఎలాంటి పరిస్థితి ఎదురుకున్నారు అనేది సినిమా. కానీ చివరకు హీరో తండ్రిగా తన కొడుకు భాద్యత తీసుకుంటాడు. వారి మధ్య సీన్స్ లో ఎమోషన్‌ని బాగా పండించారు. మరి మూవీ మొత్తం ఎలా ఉంటుందో చూడాలి.

Exit mobile version