‘Panchanama’ Trailer: ఆ మూడు మరణాలు ప్రమాదాలు కావు.. పక్కా స్కెచ్‌తో జరిగిన హత్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరుసగా మూడు మరణాలు.. చూసేందుకు అవి సాధారణ రోడ్డు ప్రమాదాల్లాగే కనిపిస్తాయి. పోలీసు రికార్డుల్లోనూ ‘యాక్సిడెంటల్ డెత్’ అని రిపోర్ట్ రాసి కేసు క్లోజ్ చేస్తారు. కానీ, ఆ మూడూ ప్రమాదాలు కావు.. ఎవరో పక్కా ప్లాన్ ప్రకారం చేసిన కిరాతక హత్యలు! అసలు ఆ ముగ్గురిని ఎవరు చంపారు? ఎందుకు చంపారు? సరిగ్గా డ్యూటీ నుంచి రిలీవ్ అవ్వడానికి కేవలం రెండ్రోజుల సమయం మాత్రమే ఉన్న ఓ పోలీస్ ఆఫీసర్ ఈ డెడ్లీ కేసును ఎలా ఛేదించాడు? లాంటి గూస్బంప్స్ తెప్పించే అంశాలతో తెరకెక్కిన సరికొత్త వెబ్ సిరీస్ ‘పంచనామా’. ప్రముఖ ఓటీటీ వేదిక జీ5 (ZEE5) ఎప్పటికప్పుడు విభిన్నమైన కంటెంట్‌తో ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో ఇంటెన్స్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ ‘పంచనామా’ను ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతోంది. ప్రముఖ నటుడు భరత్ శ్రీనివాసన్ ప్రధాన పాత్రలో, మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్ ట్రైలర్ తాజాగా విడుదలై సంచలనం సృష్టిస్తోంది. ఆది, ప్రవీణ్, జోసెఫ్ అనే ముగ్గురు వ్యక్తుల అనుమానాస్పద మరణాల వెనుక ఉన్న మిస్టరీని డీకోడ్ చేసే జై రామ్ అనే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో భరత్ శ్రీనివాసన్ అదరగొట్టాడు. ఇన్వెస్టిగేషన్ ముదిరే కొద్దీ వెలుగులోకి వచ్చే రాజకీయ అవినీతి, నేరస్థుల చీకటి ప్రపంచం ట్రైలర్‌పై విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఈ సిరీస్ గురించి నిర్మాత ఉదయ బాను మాట్లాడుతూ.. కేవలం క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మాత్రమే కాకుండా, అడుగడుగునా ఉత్కంఠ రేపే మిస్టరీకి మానవీయ భావోద్వేగాలను జోడించి ఈ ‘పంచనామా’ను రూపొందించినట్లు తెలిపారు. మరోవైపు జీ5 బిజినెస్ హెడ్ లాయిడ్ సి. జేవియర్ స్పందిస్తూ.. ఒక నిజాయితీ గల పోలీస్ అధికారి నిజం కోసం చేసే అన్వేషణ ఎంతటి భారీ క్రిమినల్ కుట్రను బట్టబయలు చేస్తుందో ఈ 6 ఎపిసోడ్ల సిరీస్‌లో ఉత్కంఠభరితంగా చూడొచ్చని నమ్మకం వ్యక్తం చేశారు. ఉదయ భాను ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మిడ్డే విజయేంద్ర మౌళి, ఉదయ భాను సంయుక్తంగా నిర్మించిన ఈ క్రైమ్ సిరీస్‌లో శివాజీ రాజా, మేధా రెడ్డి, చరణ్ బాబు, రూప లక్ష్మి, రాధిక ప్రీతి, సూర్య, శ్రీజ తదితరులు కీలక పాత్రలు పోషించారు. నాగేంద్ర పిల్ల అందించిన స్క్రీన్ ప్లే, డైలాగ్స్, నరేష్ కుమారన్ గూస్బంప్స్ తెప్పించే నేపథ్య సంగీతం, సందీప్ కాంత్ అద్భుతమైన విజువల్స్ ఈ థ్రిల్లర్‌కు ప్రధాన బలం కానున్నాయి. ఒక మరణం వెనుక దాగిన నిజం కోసం మొదలైన వేట.. చివరకు ఎలాంటి చీకటి సామ్రాజ్యాన్ని బట్టబయలు చేస్తుందో చూడాలంటే సెప్టెంబర్ 11 వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ ఇంటెన్స్ సిరీస్ సెప్టెంబర్ 11 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
Also Read
- Tollywood : ఇరుముడితో మారిన టాలీవుడ్ ట్రెండ్.. కంటెంట్ ఉంటే కనకాభిషేకమే
- Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లోకి 16 మంది.. ఆ పూర్తి లిస్ట్ ఇదిగో..
- Mandaadi : సముద్రం నడిబొడ్డున షూటింగ్.. 'మండాడి' ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివ నిర్వాణ షాకింగ్ కామెంట్స్!
- TFPC: హోరాహోరీగా ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికలు.. గెలిచింది ఎవరెవరు అంటే ?
తాజావార్తలు
-
‘Panchanama’ Trailer: ఆ మూడు మరణాలు ప్రమాదాలు కావు.. పక్కా స్కెచ్‌తో జరిగిన హత్యలు
-
Chennai Second Airport: చెన్నైకి కొత్త ఎయిర్‌పోర్టు.. విజయ్ సర్కార్ కీలక ప్రతిపాదనలు..
-
KCR: ఆ బూతుల వీరుడుతో చర్చలా?.. లక్ష మందితో కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల దగ్గరకు వెళ్దాం
-
Tollywood : ఇరుముడితో మారిన టాలీవుడ్ ట్రెండ్.. కంటెంట్ ఉంటే కనకాభిషేకమే
-
Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లోకి 16 మంది.. ఆ పూర్తి లిస్ట్ ఇదిగో..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!