Om Bheem Bush : ఓం భీమ్ బుష్ అంటున్న యూవీ.. పోస్టర్ భలే ఉంది బాసూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కలిసి ఒక సినిమా చేస్తున్నారు. హర్ష కొనుగంటి దర్శకత్వంలో యువి క్రియేషన్స్, వి సెల్యులాయిడ్స్ సంయుక్తంగా ఒక సినిమా నిర్మితమైంది. ఈ సినిమాకి ఓం భీమ్ బుష్ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా మార్చి 22న థియేట్రికల్ రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేశారు. హుషారు ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాతో శ్రీవిష్ణు, ప్రియదర్శి అలాగే రాహుల్ రామకృష్ణ ఒక క్రేజీ ఫన్ రైడ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఓం భీమ్ బుష్ అనే టైటిల్ తో ఈ సినిమా ఒక సరికొత్త కామెడీ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని మేకర్స్ చెబుతున్నారు. వి సెల్యులాయిడ్ మరియు సునీల్ బలుసు కలిసి ఈ సినిమాని నిర్మించగా యువి క్రియేషన్స్ సమర్పిస్తుంది. ప్రీ-లుక్ గ్లింప్స్‌తో దృష్టిని ఆకర్షించిన మేకర్స్, ఫస్ట్‌లుక్ పోస్టర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ ఫస్ట్ లుక్ లో ముగ్గురు వ్యోమగాములు తమ చేతుల్లో పేలుడు పరికరాలతో అంతరిక్ష నౌక నుంచి భూమిలోకి ప్రవేశిస్తున్నట్లు చూపించారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ముగ్గురూ గ్రామీణ ప్రాంతంలో చేతిలో కొన్ని కరపత్రాలతో స్టైలిష్‌గా నడుచుకుంటూ వెళ్తున్నట్టు కనిపిస్తోంది. వీరంతా వ్యోమగామి దుస్తులను ధరించారు. ఫస్ట్ లుక్ క్రేజీగా ఉంది.
Also Read; Bhama Kalapam 2: ప్రియమణి ‘భామా కలాపం 2’ సంచలనం..ఐదు రోజుల్లోనే 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్
Also Read
శ్రీ విష్ణు తన ప్రత్యేకమైన కామెడీ టైమింగ్‌తో సామజవరగమన సినిమాతో హిట్ అందుకున్నాడు. ప్రియదర్శి మరియు రాహుల్ రామకృష్ణ కాంబో కూడా బాగా ఫేమస్. నిజానికి ఓం భీమ్ బుష్ అనేది తాంత్రిక పద్ధతులలో జపించబడే మంత్రం అలాగే పిల్లలు ఆడుకునేటప్పుడు కూడా సరదాగా వాడుతూ ఉంటారు. ఇక నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అనే క్యాప్షన్ మనల్ని వినోదం పొందడానికి లాజిక్స్ గురించి పెద్దగా ఆలోచించకుండా సిద్ధం చేయడానికి వచ్చినట్టు అనిపించింది. తన తొలి సినిమా హుషారుతో తన సత్తాను నిరూపించుకున్న శ్రీ హర్ష కొనుగంటి ఈ సినిమాలో ప్రతి పాత్ర చాలా కీలకమైనది మరియు వినోదాత్మకంగా రూపొందించబడిందనీ అంటున్నారు. ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్, రాచ రవి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సాంకేతిక బృందం విషయానికి వస్తే, రాజ్ తోట సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, సన్నీ MR సంగీతం అందించారు. శ్రీకాంత్ రామిశెట్టి ఆర్ట్ డైరెక్టర్ కాగా, విజయ్ వర్ధన్ ఎడిటర్. ఓం భీమ్ బుష్ షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా, మార్చి 22న సినిమాను విడుదల చేస్తున్నట్లు పోస్టర్ ద్వారా మేకర్స్ ప్రకటించారు.
తాజావార్తలు
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!