Site icon NTV Telugu

They Call Him OG Trailer : ఓజీ ట్రైలర్ అదిరింది.. చూశారా?

Og Trailer

Og Trailer

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎన్నాళ్ళగానో ఎదురుచూస్తున్న సినిమా ఓజీ ఎట్టకేలకు ఎన్నో వాయిదాల తరువాత సెప్టెంబర్ 25 న రిలీజ్ కానుంది. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను డీవీవీ దానయ్య ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తుండగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా మంచి హైప్ ను క్రియేట్ చేసింది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండగా ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ నిన్న ఎల్ బి స్టేడియంలో ఓజీ కన్సర్ట్ పేరుతో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించాలని చూసినా వరుణుడు అంతరాయం కలిగించాడు. అయినా కూడా పవన్ ఎక్కడా తగ్గేదేలే అంటూ వర్షంలోనే తన స్పీచ్ ను కొనసాగించాడు. అంతేనా తన కోసం ఇంతదూరం వచ్చిన ఫ్యాన్స్ ను నిరాశపర్చకుండా ట్రైలర్ ఇంకా ఫినిష్ కాకపోయినా.. ఫ్యాన్స్ కోసం ఈవెంట్ లోనే ట్రైలర్ రిలీజ్ చేయించాడు. ఇక ఇప్పుడు ఆ ట్రైలర్ ఆన్ లైన్ లో రిలీజ్ చేశారు. చూసేయండి

Exit mobile version