Site icon NTV Telugu

OG : గంభీరంగా గురిపెట్టి కొట్టాడు!

Og

Og

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘ఓజీ’ సినిమా సెప్టెంబర్ 25వ తేదీన రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. నిజానికి, ఓపెనింగ్ రోజు మిక్స్‌డ్ టాక్ వచ్చినా, ఆ తర్వాత కలెక్షన్స్ డ్రాప్ కనిపించినా సరే, ఆ కలెక్షన్స్ మాత్రం స్టడీగా ఉన్నాయి. అయితే, ఇప్పటివరకు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, చాలా చోట్ల ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. కొన్నిచోట్ల ఇంకా కొంత మొత్తం రాబడితే బ్రేక్ ఈవెన్ పూర్తవుతుంది. ఒకరకంగా చెప్పాలంటే, ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ మీద వచ్చిన అన్ని ట్రోల్స్, ఆ సినిమా కలెక్షన్స్ మీద వచ్చిన నెగటివ్ ట్రోల్స్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే వచ్చి ఉండవు. కానీ, ఆ సినిమా వచ్చిన కొద్ది రోజులకే ‘ఓజీ’ సినిమా కూడా వచ్చింది.

Also Read : Deepika Padukone : కండీషన్ల గురించి చెప్పని దీపిక.. ఏంటమ్మా ఈ కవరింగులు

ప్రేక్షకులు ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ ఈసారి గురి చూసి కొట్టినట్లుగా షూర్ షాట్ హిట్ అయింది. అంతేకాదు, కలెక్షన్స్ కూడా ఏ మాత్రం వెనకడుగు వేసేది లేదన్నట్లుగా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ దిశగా దూసుకుపోయాయి. ఒక్క దెబ్బతో పవన్ కళ్యాణ్ మీద జరిగిన ట్రోలింగ్స్ అన్నింటికీ, ఆ సినిమా కలెక్షన్స్ సమాధానం చెప్పినట్లు అయింది. సుజిత్ డైరెక్ట్ చేసిన ఈ ‘ఓజీ’ సినిమా రిజల్ట్ విషయంలో పవన్ కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు. అందుకే సుజిత్‌కు ప్రీక్వెల్ అంటే ప్రీక్వెల్, సీక్వెల్ అంటే సీక్వెల్ చేయడానికి రెడీ అంటూ ఆయన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేయడం గమనార్హం

Exit mobile version