Site icon NTV Telugu

OG : 117 ఆర్టిస్టులతో బీజీఎం.. తమన్ మ్యూజికల్ అప్‌డేట్‌తో ఫ్యాన్స్‌లో జోష్

Thaman Og

Thaman Og

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ‘ఓజీ’ (OG) సినిమా కోసం అభిమానుల్లో ఎప్పటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే వరుస పోస్టర్లు, అప్‌డేట్‌లతో సినిమా హైప్ పెంచుతున్న చిత్రబృందం, తాజాగా సంగీత దర్శకుడు తమన్ ఇచ్చిన మ్యూజికల్ అప్‌డేట్‌తో ఫ్యాన్స్ ఉత్సాహం రెట్టింపు చేశారు.

Also Read : Radhika Apte: బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు.. OTT క్వీన్‌గా మారిన రాధికా

ఈ ప్రాజెక్ట్‌కి స్పెషల్‌గా పనిచేస్తున్న తమన్, ముందే జపాన్‌కు చెందిన సంప్రదాయ వాయిద్యం కోటోని ఉపయోగించి బీజీఎం రూపొందించినట్టు వెల్లడించారు. తాజాగా లండన్‌లోని స్టూడియోలో జరుగుతున్న రికార్డింగ్ ఫొటోలు, వీడియోలను షేర్ చేశారు. ఏకంగా 117 మంది సంగీత కళాకారులు ఈ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో భాగమయ్యారని తెలిపారు. “ఈసారి సంగీతం అసలే వేరే లెవెల్‌లో ఉంటుందంటూ” తమన్ ఇచ్చిన హామీతో ఫ్యాన్స్‌కి మరింత ఎగ్జైట్‌మెంట్, ఎనర్జీ పెరిగింది. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీర్ అనే గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నారు.

ఇప్పటి వరకు ఆయన చేసిన పాత్రలో ఏది పోల్చలేని విధంగా ఈ రోల్ ఉండబోతుందని టీమ్ చెబుతోంది. ఆయన సరసన ప్రియాంకా మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్‌గా పరిచయం అవుతున్నారు. అలాగే శ్రియారెడ్డి, ప్రకాశ్‌రాజ్, అర్జున్ దాస్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మాస్, యాక్షన్, ఎమోషన్‌ల మేళవింపుతో రూపొందుతున్న ఈ చిత్రం కోసం అభిమానులు రోజులు లెక్క పెడుతున్నారు.

 

Exit mobile version