పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఓజీ’. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు. డిప్యూటీ సీఎంగా ఎంత బిజీగా ఉన్నా.. తను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేశాడు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో ఓజీ కోసం ప్రత్యేకంగా టైమ్ కేటాయించాడు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించిన ఈసినిమా ఫైనల్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది.
Also Read : ‘Mirai’ : పారితోషికం లొసుగుతో ‘మిరాయ్’ను వదులుకున్న స్టార్ హీరో..
ఇక ఓజీలో పవన్ కళ్యాణ్ జంటగా ప్రియాంక అరుళ్ మోహన్ నటించగా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి విలన్‌గా కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే శ్రియా రెడ్డి, వెన్నెల కిషోర్, అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్ వంటి నటులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సినిమాలో పవన్ కళ్యాణ్ మాస్ లుక్, యాక్షన్ సీన్లు, లవ్ ట్రాక్ ప్రధాన ఆకర్షణగా ఉండనున్నట్లు యూనిట్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతుంది. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన బ్లాక్ బస్టర్ సాంగ్ సెప్టెంబర్ 15న సాయంత్రం 4:50 గంటలకు రాబోతున్నట్లు వెల్లడించారు. గన్స్ అండ్ రోజెస్‌తో అత్యంత క్రూరంగా, ప్రేమగా ఈ సాంగ్ ఉండబోతున్నట్లు చిత్రబృందం చెప్పకనే చెప్పింది. ఈ పోస్టర్ చూసిన నెటిజన్లు గూస్ బంప్స్‌ను తెప్పిస్తోందని కామెంట్లు పెడుతున్నారు.