Site icon NTV Telugu

HBD OG : OG vs OMI.. రక్తపాతమే!

Love Omi Glimpse

Love Omi Glimpse

ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ చేసే విధ్వంసం చూడ్డానికి పవన్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఓజీ లుక్స్, గ్లింప్స్, సాంగ్స్ ఫ్యాన్స్‌కు సూపర్ హై ఇచ్చాయి. ఫైర్ స్టార్మ్ సాంగ్, సువ్వి సువ్వి సాంగ్ వేటికవే అన్నట్టుగా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. దీంతో.. ఎప్పుడెప్పుడు ఈ సినిమా థియేటర్లోకి వస్తుందా? అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఫైనల్‌గా సెప్టెంబర్ 25న ఓజీ థియేటర్లోకి రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్పీడప్ చేసిన మేకర్స్ పవర్ స్టార్ బర్త్ డే గిఫ్ట్‌గా ఒక సాలిడ్ పోస్టర్ రిలీజ్ చేశారు. అలాగే.. ఒక గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ గ్లింప్స్‌ మాత్రం ఫ్యాన్స్‌కు మాస్ ఫీస్ట్ ఇచ్చేలా అదిరిపోయిందనే చెప్పాలి.

Also Read : Kriti Sanon: హీరోలకు ఇచ్చే గౌరవం మాకెందుకు ఇవ్వరు…

అలాంటోడు మళ్లీ తిరిగొస్తే ఎలా ఉంటుందో హంగ్రీ చీతా గ్లింప్స్‌తో చూపించిన సుజీత్.. ఈసారి విలన్‌ ఓమిని పరిచయం చేశాడు. ఈ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నాడు. లేటెస్ట్ గ్లింప్స్‌ ఆయన పాత్రను పరిచయం చేస్తూ కట్ చేశారు. నిమిషం నిడివితో ఉన్న ఈ గ్లింప్స్‌.. తమన్ మ్యూజిక్‌తో నెక్స్ట్‌ లెవల్లో ఉందనే చెప్పాలి. విలన్‌తో ఓజీకి ఇచ్చిన ఎలివేషన్ ఫ్యాన్స్‌కు పిచ్చెక్కించేలా ఉంది. హ్యాపీ బర్త్ డే ఓజీ అంటూ సాగిన ఈ గ్లింప్స్.. సుజీత్ స్టైలిష్ మేకింగ్‌తో మామూలుగా లేదనే చెప్పాలి. లాస్ట్‌లో రక్తపాతమే అన్నట్టుగా పవర్ స్టార్ కత్తి చేత పట్టిన షాట్ మాత్రం పీక్స్‌ అనే చెప్పాలి. ఓజీ వర్సెస్ ఓమి గ్యాంగ్‌స్టర్ వార్ సినిమాకే హైలెట్‌గా నిలిచేలా ఉంది. ఇక్కడితో సినిమా పై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. మరి రోజు రోజుకి నెక్స్ట్ లెవల్ హైప్ ఇస్తున్న ఓజీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Exit mobile version