Priyanka Mohan: దక్షిణ కొరియా పర్యాటక రంగానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ నటి ప్రియాంక మోహన్ ఎంపికయ్యారు. కొరియా టూరిజం ఆర్గనైజేషన్ (KTO) ఆమెను ‘గౌరవ రాయబారి’ (Honorary Ambassador)గా నియమించింది. సోమవారం సియోల్‌లో జరిగిన ఒక అధికారిక కార్యక్రమంలో ప్రియాంక మోహన్ ఈ బాధ్యతలను స్వీకరించారు. కొరియా పర్యాటక శాఖ ప్రెసిడెంట్ చేతుల మీదుగా ఆమె ఈ నియామక పత్రాన్ని అందుకున్నారు. రెండు దేశాల మధ్య పర్యాటక రంగాన్ని కొత్త పుంతలు తొక్కించడంలో ప్రియాంక మోహన్ నియామకం కీలక పాత్ర పోషిస్తుందని KTO ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు. గౌరవ రాయబారిగా ఎంపికైన అనంతరం ప్రియాంక మోహన్ దీనిపై స్పందిస్తూ.. “ఈ అరుదైన గౌరవం దక్కడం పట్ల కొరియా ప్రభుత్వానికి, కొరియా టూరిజం ఆర్గనైజేషన్‌కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. కొరియన్ సంస్కృతి, అక్కడి సంప్రదాయాలు నన్ను ఎప్పుడూ ఆకట్టుకుంటూనే ఉంటాయి. భారతీయ ప్రేక్షకులకు కొరియన్ సంస్కృతిని మరింత దగ్గర చేయడానికి నా వంతు కృషి చేస్తాను” అని అన్నారు.
నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఇండో – కొరియన్ వెబ్ ఫిల్మ్ ‘మేడ్ ఇన్ కొరియా’ చిత్రంలో ప్రియాంక మోహన్ ప్రధాన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాటు ఓజీ, డాక్టర్, డాన్, నాని గ్యాంగ్ లీడర్ వంటి చిత్రాలతో ఆమెకు ఉన్న భారీ ఫాలోయింగ్‌ను దృష్టిలో ఉంచుకుని కొరియా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో హాలీవుడ్, కొరియన్ స్టార్ నటుడు పార్క్ బో – గమ్ వంటి ప్రముఖులు కొరియా పర్యాటక రంగానికి ప్రాతినిధ్యం వహించగా, ఇప్పుడు ఆ లైనప్‌లో ప్రియాంక చేరారు. ఇండియా – కొరియా దేశాల మధ్య సాంస్కృతిక బంధాన్ని మరింత బలోపేతం చేయడమే కాకుండా, భారతీయ పర్యాటకులను కొరియా వైపు ఆకర్షించేందుకు ప్రియాంక మోహన్ ఇకపై ప్రచారం నిర్వహించనున్నారు.
Beyond grateful for this incredible honour 🇰🇷✨
Being appointed as the Honorary Ambassador for Korea Tourism is truly very special to me. I’m sincerely thankful to the Korean government and the Korea Tourism Organization for recognising me as someone who can help bring Korean… pic.twitter.com/Rpf0kUftHS
— Priyanka Mohan (@priyankaamohan) June 1, 2026
