NTV Telugu Site icon

Official : మరోసారి ‘దళపతి విజయ్’ సరసన పూజ హెగ్డే.. హిట్టు దక్కేనా..?

Pooja Vijay

Pooja Vijay

బాలీవుడ్ భామ పూజా హెగ్డేకు తెలుగులో సూపర్ హిట్లు అందుకుంటున్న టైమ్ లో బాలీవుడ్ చెక్కేసింది. తెలుగులో మంచి ఆఫర్స్ వస్తున్న సరే కాదని బాలీవుడ్ మోజులో ఉన్న పొడుగుకాళ్ల సుందరి టాలీవుడ్ ను చిన్న చిన్న చూపు చూసింది. పూజాకు తెలుగులో సూపర్ హిట్ అల వైకుంఠపురం వంటి అవకాశం ఇచ్చిన త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన గుంటూరు కారంలో మొదట పూజ నే హీరోయిన్ గా తీసుకున్నారు. కొన్నిసీన్స్ కూడా తీశారు. కానీ ఆ తర్వాత హిందీ సినిమా కోసం గుంటూరు కారం నుండి తప్పుకుంది ఈ భామ.

Also Read : Devara : ఎన్టీయార్ ఫ్యాన్స్ రెడీగా ఉండండమ్మా.. సక్సెస్ మీట్ ఎక్కడంటే..?

బాలీవుడ్ లో అమ్మడుకి వరుస ప్లాప్స్ రావడంతో మరల సౌత్ సినిమాల వైపు చూస్తోంది. అందులో భాగంగానే సౌత్ హీరోల సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సూర్య, కార్తీక్ సుబ్బరాజ్ కాంబోలో రానున్న సినిమాలో పూజానే హీరోయిన్. ఇదిలా ఉండగా తమిళ స్టార్ హీరో ఇళయదళపతి హీరోగా రూపొందుతున్న విజయ్ 69లో పూజా హెగ్డేను హీరోయిన్ గా ఖరారు చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. గతంలో విజయ్, పూజ కాంబోలో వచ్చిన బీస్ట్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. మరలా విజయ్ చివరి సినిమాలో మరోసారి నటిస్తోంది. ఇదిలా ఉండగా విజయ్ చివరి సినిమాలో నటించబోయే ఆర్టిస్టులను ఒక్కొక్కరిగా పోస్టర్ రిలీజ్ చేస్తూ ప్రకటిస్తున్నారు KVN ప్రొడక్షన్స్. ఇప్పటికే బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విజయ్ 69లో విలన్ గా కనిపించబోతున్నాడు అనిఅఫీషియల్ గా ప్రకటించారు. బీస్ట్ తో ప్లాప్ అందుకున్న పూజా ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకోవాలని ఫ్యాన్స్ కోరుతున్నారు

Show comments