దేవర బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో చెలరేగుతున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా 6 ఏళ్ళ తర్వాత రిలీజ్ కావడం, పోటీలో సినిమాలు ఏవి లేకపోవడం, గ్రౌండ్ ఖాళీగా ఉండడంతో దేవరకు మొదటి రోజు రూ. 172 భారీ ఓపెనింగ్స్ వచ్చింది. మొదటి మూడు రోజులు దూసుకెళ్లిన దేవర సోమవారం కాస్త తగ్గినా మంగళవారం మళ్ళి పుంజుకుంది. నేడు గాంధీ జయంతి హాలిడే కావడంతో మేజర్ సిటీస్ లో హౌస్ ఫుల్ బోర్డ్స్ కనిపించాయి. మరో రెండు రోజుల్లో అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టనుంది దేవర.
Also Read : Devara : తెలుగు రాష్ట్రాల 5 రోజుల కలెక్షన్స్.. దుమ్ములేపేసాడు..!
దేవర సూపర్ హిట్ టాక్ తో పాటు భారీ కలెక్షన్స్ రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ సాధించేసింది దేవర. కేవలం ఏపీ తెలంగాణలోనే వందకోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ రాబట్టింది దేవర. అటు డిస్ట్రిబ్యూటర్లు, ఎగిబిటర్లు ఫుల్ జోష్ లో ఉన్నారు. అసలే ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ కావడంతో ఫ్యాన్స్ కాస్త నిరుత్సహంగా ఉన్నారు. అభిమానులకు మల్లి జోష్ ఇచ్చేందుకు యూనిట్ భారీ స్థాయిలో సక్సెస్ మీట్ నిర్వహించాలని చూస్తోంది. తారక్ కూడా అమెరికా టూర్ ముగించుకుని వచ్చాడు. ఇప్పటికైతే దేవర ఈవెంట్ ను మంగళగిరిలోని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉండే గ్రౌండ్స్ లో నిర్వహించాలని ఆలోచన చేస్తోంది.ఇదేగనక జరిగితే అభిమానుల తాకిడికి పల్నాడు మారుమోగడం ఖాయం.ఏపీ కుదరని యెడల హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో చేయాలని ఆలోచిస్తున్నారు. త్వరలోనే అధికారక ప్రకటన వెలువడనుంది. కాగా ఈ ఈవెంట్ కు అమెరికా పర్యటన కారణంగా సంగీత దర్శకుడు అనిరుధ్ హాజరుకావడం లేదని తెలుస్తోంది.