నిన్న మంచు విష్ణు, మంచు మోహన్ బాబు, ప్రసాద్ ల్యాబ్‌లో మరి కొంతమందితో కలిసి “కన్నప్ప” ఫస్ట్ కాపీ చూసినట్టు వార్తలు వచ్చాయి. అయితే, “కన్నప్ప” సినిమా విఎఫ్ఎక్స్ పూర్తి కాని నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు మంచు విష్ణు ప్రకటించాడు. విఎఫ్ఎక్స్ పూర్తి కాకపోతే ఫస్ట్ కాపీ ఎలా చూస్తారని అనుమానాలు వ్యక్తం అయ్యాయి. సినిమా పూర్తయింది కానీ బిజినెస్ పూర్తి కాకపోవడం, లాంటి కారణాలతో సినిమా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారేమో అని అందరూ భావించారు. ఈ మేరకు పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. తాజాగా ఈ అంశంపై “కన్నప్ప” సినిమా టీం స్పందించింది.
Sree Leela: పాపం శ్రీలీల… అంతన్నాది ఇంతన్నాది కానీ?
నిన్న ఎలాంటి ప్రీమియర్ వేయలేదని, టీం 15 నిమిషాల విఎఫ్ఎక్స్ సెగ్మెంట్ క్వాలిటీ అసెస్మెంట్ అలాగే కరెక్షన్స్ కోసం వెళ్లిందని చెప్పుకొచ్చారు. ఫస్ట్ కాపీ ఇంకా రెడీ కాలేదని, ఇంకా సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. విఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువగా ఉండటంతో ఎక్కువ సమయం, ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఈ విషయంలో దయచేసి మీడియా అలాగే అభిమానులు ఎలాంటి తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దు, అలాగే వ్యాప్తి చేయవద్దని కోరారు. అధికారికంగా ఏ సమాచారమైనా తాము వెల్లడిస్తామని, అప్పటివరకు ఏదీ నమ్మవద్దని కోరారు.