Site icon NTV Telugu

Dhanush : మరో సినిమాకు ధనుష్ గ్రీన్ సిగ్నల్.. దర్శకుడు ఆయనే..

Untitled Design (46)

Untitled Design (46)

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘రాయన్’  సూపర్ హిట్ గా నిలిచింది. రిలీజ్ అయిన అన్ని భాషల్లోనూ అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది రాయన్. ఇదే కోవలో ధనుష్ దర్శకత్వంలో రానున్న మరో సినిమా  NEEK (నిలవుకు ఎన్ మేల్ ఎన్నడి కోబమ్) సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది.  ఆ చిత్రంతో పాటు మరో సినిమాకు ధనుష్ దర్శకత్వం వహిస్తున్నడని తెలుస్తోంది. ధనుష్ దర్శకత్వం వహించే ఈ సినిమాలో హీరోగా తమిళ యంగ్ హీరో అరుణ్ విజయ్ నటించనున్నాడని తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. మరోవైపు హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర’ సినిమాలో  నటిస్తున్నాడు.

Also Read : Nani : సరిపోదా శనివారం హిట్టే…కానీ అక్కడ మాత్రం నష్టాలు తప్పలేదు..

వరుస సినిమాలతో బిజీగా ఉన్న ధనుష్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తన కెరీర్ లో 52వ సినిమాగా రానుంది. ఈ చిత్రానికి తానే దర్శకత్వం వహించడం విశేషం. ఈ సినిమాను ఆకాష్ బాస్కరన్ డాన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ మేరకు ఒక పోస్టర్ ను సోషల్  మీడియా వేదికగా పంచుకున్నారు. ‘డాన్ పిక్చర్స్ బ్యానర్ లో రానున్న మొదటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను ప్రకటించడానికి సంతోషిస్తున్నాము, ఇది మా ప్రొడక్షన్ హౌస్‌కి ఒక ముఖ్యమైన మైలురాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులను అలరించడానికి, ధనుష్ ఫ్యాన్స్ కు  వినూత్నమైన కంటెంట్‌ను రూపొందించడానికి సిద్ధంగా ఉన్నాము. మా తోలి ప్రాజెక్ట్ ధనుష్ సర్ నటించిన ‘నడిపిన్ అసురన్’ “D52″ని ప్రకటించడం గర్వంగా ఉంది. ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు మేము ధనుష్‌కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము’ అని నిర్మాత ఆకాష్ భాస్కరన్ తెలిపారు.

Exit mobile version