ఇటీవల విడుదలైన ‘ఓదెల 2’ మూవీ ఎంత మంచి సక్సెస్ అందుకుందో చెప్పక్కర్లేదు. తమన్నాతో పాటు హెబ్బాపటేల్, వశిష్ట ఎన్ సింహా, మురళీ శర్మ కీలక పాత్రలు పోషించిన ఈ మూవీకి డైరెక్టర్ సంపత్ నంది కథను అందించిన ఈ మూవీకి అశోక్ తేజ దర్శకత్వం వహించాడు. ప్రేతాత్మకు, నాగసాధువుకు మధ్య పోరాటం నేపథ్యంలో సంపత్ నంది ఈ కథను రాసుకున్నారు. ఈ నెల 17న రిలీజైన ఈ మూవీ లో ప్రతి ఒక సీన్ డైలాగ్.. భయనకం గానే ఉన్నాయి. ప్రేక్షకులు కూడా బాగా ఎంజాయ్ చేశారు.
Also Read : Surya : ఆ విషయంలో ఇప్పటికి బాధపడుతున్న..
ముఖ్యంగా తమన్నా ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథలో కొంత వైవిధ్యం కనిపిస్తుంది. మునుపెన్నడూ చూడని విధంగా తమన్న తనలోని కొత్త కోణాని చూపించింది. మొదటి భాగంలో కొంత అడల్ట్ కనిపించినప్పటికి.. ఈ రెండో భాగం మాత్రం చాలా డీసెంట్‌గా తీశాడు. కానీ కొంత మంది రొటీన్ స్టోరీలైన్‌తో పాటు ప్రేతాత్మతో నాగసాధువు పోరాటాన్ని పవర్‌ఫుల్‌గా చూపించలేకపోయాడు డైరెక్టర్ అంటూ కామెంట్స్ వినిపించాయి. అయినప్పటికి నాగసాధువుగా తమన్నా యాక్టింగ్‌కు మాత్రం ప్రశంసలు దక్కాయి.ఇక తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ OTT రిలీజ్ కు సిద్ధం అయింది. ఓదెల 2 మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా ఈ నెల 16 నుంచి మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. దీని గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే అమెజాన్ ప్రైమ్‌తో పాటు ఆహా ఓటీటీలోనూ ఓదెల 2 మూవీ స్ట్రీమింగ్ కానుంది. దీని గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
