Site icon NTV Telugu

NTRNEEL : ఎన్టీఆర్ – నీల్.. గాల్లో గూస్‌బంప్స్?

Ntr Neel

Ntr Neel

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న డ్రాగన్ చిత్రంపై రోజుకో ఆసక్తికరమైన వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. తాజాగా ఈ సినిమా యాక్షన్ సీక్వెన్స్‌కు సంబంధించి ఒక క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో ప్రశాంత్ నీల్ తన మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్‌ను నెక్స్ట్ లెవెల్‌లో ప్లాన్ చేసినట్లు సమాచారం. ముఖ్యంగా ఈ సినిమా ఇంటర్వెల్ బ్లాక్ కోసం ఒక ఊహించని భారీ ఫైట్‌ను డిజైన్ చేశారట. గాల్లో ఎగురుతున్న ఫ్లైట్‌లో ఈ హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ సాగుతుందని ఇది ప్రేక్షకులకు గూస్‌బంప్స్ ఇచ్చేలా ఉంటుందని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read : AA25 : ధురంధర్ హీరో కథతో ఐకాన్ స్టార్?

ఈ ఫైట్ కేవలం యాక్షన్ కోసమే కాకుండా సినిమాలో రాబోయే బిగ్గెస్ట్ ట్విస్ట్‌కు లీడ్‌గా ఉంటుందని తెలుస్తోంది. సినిమా మొత్తానికి ఈ ఇంటర్వెల్ ఎపిసోడ్ హైలైట్‌గా నిలవనుందట. మామూలుగానే ప్రశాంత్ నీల్ తన హీరోలను ఎలివేట్ చేయడంలో దిట్ట. అందులో.. ఎన్టీఆర్ లాంటి పవర్‌ఫుల్ పెర్ఫార్మర్‌, మాస్ హీరోని ఇంకే రేంజ్‌లో చూపిస్తాడో ఊహించుకోవచ్చు. ఎన్టీఆర్-నీల్ మాస్ తాండవానికి థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. సాధారణంగా ప్రశాంత్ నీల్ సినిమాలంటే డార్క్ థీమ్, ఫుల్ బ్లాక్ అండ్ గ్రే షేడ్స్ ఎక్కువగా కనిపిస్తాయి. కానీ ఈసారి ఎన్టీఆర్‌తో చేస్తున్న సినిమాను ఆయన సరికొత్త స్టైల్లో ప్రెజెంట్ చేయబోతున్నారట. ఈ చిత్రం పూర్తి కలర్‌ఫుల్ విజువల్స్‌తో, రిచ్ మేకింగ్‌తో ఉండబోతోందని సినీ వర్గాల సమాచారం. అయితే, ఈ విషయంలో క్లారిటీ రావాలంటే.. డ్రాగన్ ఫస్ట్ లుక్ బయటికొచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే!

Exit mobile version