Box Office Clash: టాప్ హీరోయిన్స్ మధ్య వార్.. స్టార్ బ్యూటీల్లో గెలిచేదెవరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
November 20 Heroines Box Office Clash: సంక్రాంతి, దసరా వంటి పెద్ద పండగ సీజన్ కాకపోయినా.. నవంబర్ 20న టాలీవుడ్, కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పోటీ నెలకొనబోతోంది. ఒకేసారి మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానుండటంతో.. సినీ అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ పోటీ కేవలం సినిమాలు, హీరోస్ మధ్య మాత్రమే కాదు.. స్టార్ హీరోయిన్ల మధ్య కూడా జరగనుంది. కీర్తి సురేష్, సాయిపల్లవి, శ్రీలీల, శ్రుతి హాసన్ వంటి టాప్ హీరోయిన్స్ తమ సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.
‘సత్యవాన్ సావిత్రి’తో కీర్తి సురేష్:
వరుస సినిమాలతో బిజీగా ఉన్న మహానటి కీర్తి సురేష్.. ఫీమేల్ సెంట్రిక్ మూవీ ‘సత్యవాన్ సావిత్రి’తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నవంబర్ 20న ఈ సినిమా విడుదల కానుంది. ఇందులో కీర్తి లాయర్ పాత్రలో కనిపించనుంది. కథానాయిక ప్రాధాన్యమున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. కీర్తి తన నటనతో మరోసారి మెప్పిస్తుందా? అన్నది చూడాలి.
Also Read
- Shashank Srihari : రియల్ స్టార్ శ్రీహరి ఇంట పెళ్లి సందడి.. పెద్ద కుమారుడి నిశ్చితార్థం ఎప్పుడంటే.?
- Dhanashree Verma: చాహల్ మాజీ భార్య ధనశ్రీ హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ..
- Allu Arjun: దుల్కర్ ఒక స్టార్ కిడ్ అయినా ఆ పొగరు ఏమాత్రం ఉండదు
- Dulquer Salmaan: మేమిద్దరం 'నెపో కిడ్స్'.. కానీ బ్యాక్‌గ్రౌండ్ లేని కొత్తమ్మాయిని లాంచ్ చేయడం మా అదృష్టం!
‘ఓమ్’లో సాయిపల్లవి, శ్రీలీల సందడి:
సాయిపల్లవి, శ్రీలీల కలిసి ‘ఓమ్’ సినిమాతో బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నారు. ఈ చిత్రంలో శ్రీలీల ధనుష్ భార్యగా కనిపించనుండగా.. సాయిపల్లవి నెవ్వర్ బిఫోర్ అవతార్‌లో ప్రేక్షకులను అలరించనుంది. నిత్యా రెడ్డి అనే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆమె కనిపించబోతోందని తెలుస్తోంది. ఈ ఇద్దరు భామల పాత్రలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఓమ్ కూడా నవంబర్ 20నే విడుదల కానుంది.
‘ఆకాశంలో ఓ తార’లో శ్రుతి హాసన్ కీలక పాత్ర:
దుల్కర్ సల్మాన్ నటించిన ‘ఆకాశంలో ఓ తార’ కూడా నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. సాత్విక వీరవల్లి ఈ సినిమాతో హీరోయిన్గా పరిచయం అవుతున్నప్పటికీ.. శ్రుతి హాసన్ కీలక పాత్రలో కనిపించనుంది. ఆమె ఇందులో పవర్ఫుల్ సైంటిస్ట్‌గా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తన కాళ్లపై తాను నిలబడే ఆధునిక యువతి పాత్రలో శ్రుతి కనిపించనుందని టాక్.
హీరోయిన్ల మధ్య ఎవరిది పైచేయి?:
ఒకే రోజున మూడు సినిమాలు విడుదలవుతుండటంతో బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ తప్పేలా లేదు. కీర్తి సురేష్, సాయిపల్లవి, శ్రీలీల, శ్రుతి హాసన్.. తమ తమ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. కథ, నటన, ప్రేక్షకుల ఆదరణ.. ఈ మూడు అంశాలే సినిమాల విజయాన్ని నిర్ణయించనున్నాయి. నవంబర్ 20న జరిగే ఈ బాక్సాఫీస్ పోరులో ఏ సినిమా పైచేయి సాధిస్తుంది?.. ఏ హీరోయిన్ ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటుంది? అన్నది చూడాలి.
తాజావార్తలు
-
Box Office Clash: టాప్ హీరోయిన్స్ మధ్య వార్.. స్టార్ బ్యూటీల్లో గెలిచేదెవరు?
-
Cyclone Alert: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. తీరం వైపు దూసుకొస్తున్న తుఫాన్..!
-
IOB FD Rate Hike: FD వడ్డీ రేట్ల పెంపు.. 444 రోజుల డిపాజిట్‌పై 6.85% వడ్డీ.. రూ.5 లక్షలకు ఎంత లాభం?
-
Tata Motors దూకుడు మాములుగా లేదుగా.. 10 నెలల్లోనే గతేడాది లెక్కలు తారుమారు.!
-
IND vs NZ: తక్కువ స్కోరుతోనే టీమిండియా సంచలనం.. 46 ఏళ్ల రికార్డు జాబితాలో భారత్!
ట్రెండింగ్
-
Oppo Reno 17 నుంచి Xiaomi 18 Pro వరకు.. ఈ వారం రాబోతున్న కొత్త స్మార్ట్ ఫోన్లు ఇవే..!
-
Jio యూజర్లకు బిగ్ షాక్.. ఇకపై ఆ వినియోగదారులకు సేవలు బంద్..? అలర్ట్ మెసేజ్‌లు షురూ..!
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్‌గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!