Site icon NTV Telugu

Rewind 2024 Mollywood : కలెక్షన్సే కాదు.. ప్రశంసలు సైతం దక్కించుకున్న మాలీవుడ్

Mollywood

Mollywood

మలయాళంలో స్మాల్ బడ్జెట్ మూవీస్, చోటా యాక్టర్స్ మాత్రమే కాదు, సీనియర్లు మరోసారి తమ టాలెంట్ ఫ్రూవ్ చేసుకున్నారు. యూత్ హీరోలతో పోటీ పడ్డారు సీనియర్లు, స్టార్ హీరోలు. బిగ్గెస్ట్ హిట్స్ చూశారు. యంగ్ హీరోలకు గట్టిపోటీ ఇచ్చారు స్టార్ హీరోస్. బ్రహ్మయుగంతో మమ్ముట్టి మరోసారి తన మార్క్ ఆఫ్ యాక్టింగ్ చూపిస్తే, గోల్ లైఫ్‌తో మరోసారి టాలెంట్ ఫ్రూవ్ చేసుకున్నాడు పృధ్వీరాజ్ సుకుమారన్‌. 2024 గోల్డెన్ ఇయర్‌గా మారింది స్టార్ హీరో పృధ్వీకి. అటు నటుడిగా, ఇటు నిర్మాతగా పట్టిందల్లా బంగారమైంది. ద గోట్ లైఫ్ ఏకంగా రూ. 160 కోట్ల రూపాయలను కొల్లగొడితే ఓన్ ప్రొడక్షన్ హౌజ్ నుండి వచ్చిన ‘గురువాయిరు అంబలనడయిల్’ దాదాపు వంద కోట్లను రాబట్టుకుంది.

Also Read : Director Bobby : బాలయ్య క్యారవాన్‌ దరిదాపుల్లో కూడా నేను ఉండను

ఇక ఈ ఏడాది మిక్స్ డ్ రిజల్ట్ చూశాడు ఫహాద్ ఫజిల్. ఆవేశంతో కోట్లు కొల్లగొట్టిన పఫా బొగన్ విల్లియాతో మెప్పించలేకపోయాడు. జస్ట్ క్యామియోకి ఎక్కువ, సైడ్ క్యారెక్టర్‌కు తక్కువగా మారిపోయింది. కుంచికో బబన్ ఏ మ్యాజిక్ చేయలేకపోయాడు. అన్వేషిప్పన్ కండేతుమ్, ఏఆర్‌ఎంతో కెరీర్ బెస్ట్ హిట్స్ చూశాడు టొవినో థామస్. ఇక కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ బరోజ్ అంటూ వచ్చాడు. దర్శకుడిగా ప్రశంసలు దక్కినప్పటికీ  వసూళ్ల పరంగా చాలా వెనుకబడింది బరోజ్. 2024కి ఫైనల్ టచ్ ఇచ్చాడు ఉన్నిముకుందన్. మార్కో లాంటి వయలెంట్ మూవీతో వచ్చి కోట్లు కొల్లగొడుతున్నాడు. ఇవే కాదు ఆట్టమ్ 70వ నేషనల్ ఫిల్మ్ అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా నిలిచింది. ‘ఆల్ వీ ఇమేజ్ యాజ్ లైట్’ 82వ గోల్డెన్ గ్లోబల్ అవార్డుల్లో రెండు విభాగాల్లో ఎంట్రీ దక్కించుకుంది. ఇది ఓవరాల్ 2024 మలయాళ సినిమాల రివైండ్. నెక్ట్స్ ఇయర్ కూడా ఇంతే ఎంటర్ టైన్ చేయాలని ఆశిద్దాం.

Exit mobile version